రెండు పిల్లి పిల్లల మధ్య
ఒక తుఫానురాత్రి
ప్రారంభిమైన తగవులాట
పెరిగి, కొట్టుకునేదాకా వచ్చింది.
ఒకదాని దగ్గర ఎలక ఉంది
రెండోదాని దగ్గర లేదు,
అసలీ తగవంతటికీ
మూలకారణం అదే!
“ఆ ఎలుక నా క్కావాలి,”
అంది రెండింటిలో పెద్దది
“నీకు ఎలక కావాలేం?
అదెలా జరుగుతుందో చూద్దాం!”
“ఆ ఎలక నెలాగైనా తీసుకుంటాను,”
అంది ‘తాబేలు డిప్ప’
అని, ఉమ్ముతూ, గీకుతూ
దాని చెల్లెలుమీద దూకింది.
నే చెప్పినదంతా ఆ రాత్రి
తుఫాను రాకముందు పిల్లిపిల్లలు
రెండూ తగవులాడుకోడం
ప్రారంభించినప్పటి సంగతి.
ఈ లోపున ముసలావిడ
తుడుచుకునే చీపురుకట్ట తీసి
రెండింటినీ గది అవతలకి
గట్టిగా విసిరేసింది.
అక్కడ నేలంతా
మంచుతో తడిసిఉంది
నోటిదగ్గరకూడు పోయింది
వెళ్ళడానికి వేరే దారి లేదు.
అందుకని తలుపుమాటున
వణుకుతూ నిలుచున్నాయి
ఆ ముసలామె గది తుడుపు
పూర్తి అయ్యేదాకా.
రెండూ మెల్లగా ఎలకల్లా
చడీచప్పుడులేకుండా లోనకొచ్చాయి
ఒంటినిండా మంచుతో
ఒళ్ళంతా చలిపట్టుకుపోయి
ఆ తుఫాను రాత్రి
తగవులాడుకుని తన్నుకోవడంకంటే
పొయ్యిదగ్గర చలికాచుకోవడం
ఉత్తమమని తెలుసుకున్నాయి.
.
జేన్ టేలర్
(23 September 1783 – 13 April 1824)
ఇంగ్లీషు కవయిత్రి
“ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్” ద్వారా ప్రఖ్యాతి వహించింది.

English Poetess
‘Twinkle Twinkle Little Star’ Fame.
స్పందించండి