కాలవిహంగము… సరీజినీ నాయుడు, భారతీయ కవయిత్రి
ఓ కాల విహంగమా! ఫలభరితమైన నీ పొదరింటినుండి
నువ్వు ఏ రాగాలను ఆలపిస్తున్నావు?
జీవితంలోని ఆనందం, గొప్పతనం గురించా,
పదునైన దుఃఖాలూ, తీవ్రమైన వివాదాలగురించా?
హుషారైన వాసంత గీతాలనా;
రానున్న భవిష్యత్తు గురించి బంగారు కలలనా,
రేపటిఉదయానికి వేచిఉండగల ఆశగురించా?
ప్రాభాత వేళల పరిమళభరితమైన తెమ్మెరలగురించా
మనుషులు మరణమని పిలిచే మార్మిక నిశ్శబ్దంగురించా?
ఓ కాలవిహంగమా! నీ గొంతులో అవిరళంగా మారే
నీ శృతుల గమకాలను ఎక్కడ నేర్చావో చెప్పవూ?
ప్రతిధ్వనించే అడవులలోనా, విరిగిపడే అలలలోనా
ఆనందంతో తృళ్ళిపడే నవవధువుల నవ్వులలోనా?
అప్పుడే పొడచూపుతున్న వసంత నికుంజాలలోనా?
తల్లి ప్రార్థనలకు పులకించే తొలిపొద్దులోనా?
నిరుత్సాహపడిన హృదయానికి ఆశ్రయమిచ్చే యామినిలోనా?
జాలిగా విడిచే నిట్టూర్పులోనా, ఈర్ష్యతో కలిగే రోదనలోనా
లేక విధిని ధిక్కరించిన మనసు ఆత్మవిశ్వాసంలోనా?
.
సరోజినీ నాయుడు
(13 February 1879 – 2 March 1949)
భారతీయ కవయిత్రి

.
The Bird of Time
.
O Bird of Time on your fruitful bough
What are the songs you sing? …
Songs of the glory and gladness of life,
Of poignant sorrow and passionate strife,
And the lilting joy of the spring;
Of hope that sows for the years unborn,
And faith that dreams of a tarrying morn,
The fragrant peace of the twilight’s breath,
And the mystic silence that men call death.
O Bird of Time, say where did you learn
The changing measures you sing? …
In blowing forests and breaking tides,
In the happy laughter of new-made brides,
And the nests of the new-born spring;
In the dawn that thrills to a mother’s prayer,
And the night that shelters a heart’s despair,
In the sigh of pity, the sob of hate,
And the pride of a soul that has conquered fate.
.
Sarojini Naidu
(13 February 1879 – 2 March 1949)
Indian Poet
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి