గడపలు… కేల్ యంగ్ రైస్, అమెరికను కవి

ప్రతి క్షణం ఒక ద్వారం, ప్రతి రోజూ, గంటా, ప్రతి ఏడూ
జరిగినవీ, జరగబోయేవీ అన్నీ అందులోంచే మాయమౌతాయి.
వాటిలోంచే ఈ సృష్టి అంతా, సచేతనంగానో, అచేతనంగానో
జీవితమనే అద్భుతంనుండి మృత్యువనే రహస్యం వరకూ జారుకుంటాయి.

ప్రతి క్షణమూ ఒక కవాటము, అది అగోచరంగా ఆహ్వానిస్తుంది
విషాదం కలిగించే దుఃఖాల్నీ, ఎదురౌతున్న సౌఖ్యాల్నీ వెగటుపుట్టేదాకా
మనం వాటిలోంచి ఆవేశంగా ప్రవేశించి, శాంతితో బయటకు వస్తాము
మధ్యనున్నదంతా ప్రయాసా, పారవశ్యం, చివరకి విముక్తీ.

ప్రతి క్షణమూ ఒక ప్రవేశద్వారం శ్వాసగృహంలో ఉన్న ప్రతిజీవికీ,
మృత్యుగృహంలో ఉన్నవారికి నిశ్శబ్దం కప్పుకున్న అనంత శూన్యం;
ఈ రెండు ప్రపంచాలగురించి మనకి తెలిసినదంతా సంక్షిప్తంగా ఇలా అన్నారు:
“ఈ రోజు మనం బ్రతికున్న వారితో, రేపు మరణించిన వారితో”

ప్రతి క్షణం ఒక సింహద్వారం, కానీ ఇంటిలో దేముడున్నాడు
దేముడుకూడా ఎలాగోలా రేపుల్నీ, నేడుల్నీ కలుపుతాడని మనం అనుకుంటాం
ఒకవేళ అలాచెయ్యలేకపొతే, ఇంకా సంతోషించండి! మనిషే దేముడు కనుక,
వాడు ఆత్మలేని మట్టిలో, ప్రపంచం ఎలా ఉండాలో కనుగొంటున్నాడు.
.

కేల్ యంగ్ రైస్

(7 December  1872 – 24 January  1943)

అమెరికను కవి

.

Thresholds

.

Each moment is a threshold, each day and hour and year,

Of what has been, what shall be, of what shall disappear.

And through them slips the Universe, with still or throbbing tread,

From the mystery of the living, to the mystery of the dead.

Each moment is a threshold, that leads invisibly

To grief that glooms, joy that looms, to dull satiety.

We pass to them with passion, and out of them with peace,

And all the way is struggle, or rapture—and release.

Each moment is a threshold, to Being’s House of Breath,

Or to the void, silence-cloyed, in Being’s House of Death;

But all we know of either in these words has been said,

‘To-day we’re with the living, to-morrow with the dead.’

Each moment is a threshold, but God is in the House,

God too, we think, somehow to link the Morrows with the Nows.

Or if He is not, marvel! For man himself is God,

Seeing a world that should be, within a soulless clod.

.

Cale Young Rice

(7 December  1872 – 24 January  1943)

American Poet and Dramatist

Poem Courtesy:

https://www.poetrynook.com/poem/thresholds?dist=random

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: