రోజు: ఏప్రిల్ 16, 2018
-
ఈ రోజు గడిచింది… లాంగ్ ఫెలో, అమెరికను కవి
మొత్తానికి రోజు గడిచింది, రేయి రెక్కలనుండి చీకటి జాలువారుతోంది, ఎగురుతున్న గ్రద్ద ఈక ఒకటి ఊడి క్రిందకి తేలియాడుతూ రాలుతున్నట్టు. ఈ పొగమంచులోంచీ, రాలుతున్న తుంపరలోంచీ ఆ పల్లెలోని దీపాలు మిలమిలా మెరుస్తున్నాయి; నన్ను ముసురుకుంటున్న దుఃఖాన్ని నా మనసు నిగ్రహించలేకపొతోంది ఒక ఆవేదన, ఒక విషాద భావన అది పొగమంచుకీ తుంపరకి ఉన్న సామ్యంలా అది బాధ అని అనలేను గాని ఒక విషాదకరమైన మానసిక స్థితి. రండి, ఎవరైనా ఒక పద్యాన్ని…