పొద్దుపొడవకముందే
ఒక కవిత
నా దగ్గరకి వచ్చి నిలుచుంది
ఒంటినిండా
చిరుగులుపడ్డ
మాటలు కప్పుకుని.
తనకి ఇవ్వడానికి
నా దగ్గర ఏమీ లేదు
అయినా తను నాకు
అందించిన
విరిగిన సూది అందుకున్నాను
అది తన నగ్నత్వాన్ని
క్షణకాలం గమనించే
అవకాశాన్ని కల్పించింది.
అంతే! దానితో
మరొకమారు
చిరుగులకు అతుకు వెయ్యగలిగాను.
.
షున్ తారో తనికావా
Born: 15 Dec. 1931
జపనీస్ కవి

Wikipedia.org
స్పందించండి