నీకోసం రోదించను… ఎలెన్ గేట్స్, అమెరికను కవయిత్రి
నువ్వు రావాలని పదే పదే కోరుకుంటూ రోదించను
… నా జీవితమంతా రోదిస్తూ అసలు గడపను;
కానీ ఎంతకాలం సూర్యాస్తమయాలు ఎర్రబడుతూ,
సుప్రభాతాలు ఆలస్యం కాకుండా వస్తుంటాయో
అంతకాలమూ నేను ఒంటరిగానే ఉంటాను…
నీ చేతినీ, మాటనీ, నవ్వునీ, ముద్దునీ కోల్పోతూ.
నీ పేరు తరచుగా స్మరించను,
కొత్తముఖాలకి ఏం అర్థమౌతుంది గనక
ఓ రోజు అనుకోకుండా ఒక పెద్ద తుఫాను వచ్చిందనీ
నా తోటని బోసి చేసి పోయిందనీ చెబితే?
ఆ తర్వాత నువ్వు పోయావు, నీ జాగాలో
తలెత్తుకుని మరీ నిశ్శబ్దం నిలబడి ఉంది.
ఈ వియోగం ఎన్నాళ్ళో ఉండదు లే,
… నేను నెమ్మదిగా నడిస్తే నడవొచ్చుగాక,
కానీ అనంతత్వాన్ని చేరుకుంటాను,
నువ్వు వెళ్ళిన దారి కనుక్కుంటాను;
అందాకా, నా పని నేను చూసుకుంటూ, బయటకి
పోయే తలుపు తెరుచుకునే వేళకై ఎదురుచూస్తాను.
.
ఎలెన్ గేట్స్
12 August 1835 – October 1920
అమెరికను కవయిత్రి
.
I Shall Not Cry Return
.
I shall not cry Return! Return!
— Nor weep my years away;
But just as long as sunsets burn,
— And dawns make no delay,
I shall be lonesome — I shall miss
Your hand, your voice, your smile, your kiss.
Not often shall I speak your name,
— For what would strangers care
That once a sudden tempest came
— And swept my gardens bare,
And then you passed, and in your place
Stood Silence with her lifted face.
Not always shall this parting be,
— For though I travel slow,
I, too, may claim eternity
— And find the way you go;
And so I do my task and wait
The opening of the outer gate.
.
Ellen M. Huntington Gates
12 August 1835 – October 1920
American Poet
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి