నువ్వు రావాలని పదే పదే కోరుకుంటూ రోదించను … నా జీవితమంతా రోదిస్తూ అసలు గడపను; కానీ ఎంతకాలం సూర్యాస్తమయాలు ఎర్రబడుతూ, సుప్రభాతాలు ఆలస్యం కాకుండా వస్తుంటాయో అంతకాలమూ నేను ఒంటరిగానే ఉంటాను… నీ చేతినీ, మాటనీ, నవ్వునీ, ముద్దునీ కోల్పోతూ.
నీ పేరు తరచుగా స్మరించను, కొత్తముఖాలకి ఏం అర్థమౌతుంది గనక ఓ రోజు అనుకోకుండా ఒక పెద్ద తుఫాను వచ్చిందనీ నా తోటని బోసి చేసి పోయిందనీ చెబితే? ఆ తర్వాత నువ్వు పోయావు, నీ జాగాలో తలెత్తుకుని మరీ నిశ్శబ్దం నిలబడి ఉంది.
ఈ వియోగం ఎన్నాళ్ళో ఉండదు లే, … నేను నెమ్మదిగా నడిస్తే నడవొచ్చుగాక, కానీ అనంతత్వాన్ని చేరుకుంటాను, నువ్వు వెళ్ళిన దారి కనుక్కుంటాను; అందాకా, నా పని నేను చూసుకుంటూ, బయటకి పోయే తలుపు తెరుచుకునే వేళకై ఎదురుచూస్తాను. .