ఓహ్, అతని పేరు స్మరించకండి! అతని అస్తికలు నిర్లిప్తంగా ఏ సమ్మానమూ లేక పడి ఉన్నట్లే అజ్ఞాతంలోనే పరుండనీండి; దుఃఖంతో మేము మౌనంగా కార్చే కన్నీరు, అతని సమాధిపై తలదిక్కున బొట్టుబొట్టుగా రాలే రాత్రికురిసిన మంచులా బరువుగా రాలనీండి.
కానీ, రాత్రి కురిసిన మంచు, అది మౌనంగా రోదిస్తే రోదించుగాక, అతను పరున్న సమాధి నలుదుక్కులా పచ్చని తివాచీ కప్పుతుంది; మేము కార్చే కన్నీరు అది ఎవరికీ కనిపించకపోతే కనిపించకపోవచ్చు గాక కానీ, అతని స్మృతిని మా మనసులలో చిరస్థాయిగా నిలుపుతుంది. .
స్పందించండి