ప్రకృతి ఒక రసానంద నివహం … రిచర్డ్ వాట్సన్ గిల్డర్, అమెరికను కవి

ప్రకృతి ఒక రసానంద నివహం

దాని విన్యాసమునకు ఎదురులేక సాగిపోతున్నది.

అవిగో దాని స్వచ్ఛ మధుర కలస్వనములు;

వేల పదఘట్టనలు నాకు వినిపిస్తున్నయి.

గాలికి తూగుతున్న పచ్చికని తొక్కుతూ పోతున్నది

ఆ మైదానమంతా దాని సొగసులే నిండి ఉన్నయి ;

ప్రతిధ్వనించే ఎత్తైన కొండ దారులలో

నాకు వేవేల ఫిరంగుల మోత వినిపిస్తోంది.

అది నా తోట వాకిలిని ముట్టడించింది

అంతలోతైన నూతినీటినీ చుక్క మిగలకుండా త్రాగేస్తుంది

దానికి అలుపులేదు; అది ఎవరికోసమూ ఆగదు;

రాత్రనక పగలనక అది విహరిస్తూనే ఉంటుంది

నా ద్వారదేశంనుండి అనంతంగా సాగుతూనే ఉంటుంది.

దానిని బ్రతిమాలుకున్నా నా మాట వినిపించుకోదు.

అదెక్కడనుండి వస్తోందో నాకు తెలియదు; ఎక్కడికి

పోతోందో కూడా తెలియదు; నేను పస్తులున్నా,

సుష్టుగా తిన్నా, నిద్రపోయినా బ్రతికున్నా,చచ్చినా,

పాడినా, రోదించినా నన్నసలు లక్ష్య పెట్టదు…

ఇపుడు దాని పతాకలు కాంతితో మెరుస్తున్నాయి

మరుక్షణంలో దాని శక్తుల పోరాటంలో నల్లబారుతున్నాయి.

ఒకసారి దాని నవ్వు ఆకసాన్ని సైతం గడగడలాడిస్తుంది

ఒక్కోసారి మృతుల మరణరోదనలు వినిపిస్తుంది.

అయినప్పటికీ, రేయినుండి పగలువరకూ, పగలంతటా

ఈ రసానంద నివహం అలుపులేకుండా ముందుకు పోతూనే ఉంటుంది. 

 .

రిచర్డ్ వాట్సన్ గిల్డర్

(February 8, 1844 – November 19, 1909)

అమెరికను కవి

 

.

Great Nature is an army gay

.

Great Nature is an army gay, 

Resistless marching on its way;       

          I hear the bugles clear and sweet,    

I hear the tread of million feet.

          Across the plain I see it pour;        

It tramples down the waving grass; 

Within the echoing mountain-pass   

          I hear a thousand cannon roar.        

    It swarms within my garden gate;

My deepest well it drinketh dry.              

It doth not rest; it doth not wait;      

By night and day it sweepeth by;     

Ceaseless it marches by my door;    

It heeds me not, though I implore.   

I know not whence it comes, nor where             

It goes. For me it doth not care—    

Whether I starve, or eat, or sleep,    

Or live, or die, or sing, or weep.      

And now the banners are all bright, 

Now torn and blackened by the fight.                

Sometimes its laughter shakes the sky,     

Sometimes the groans of those who die.    

Still through the night and through the livelong day     

The infinite army marches on its remorseless way.      

.

Richard Watson Gilder

(February 8, 1844 – November 19, 1909)

American Poet

Poem Courtesy:

The World’s Best Poetry. 1904.

Volume V. Nature. 

1. Nature’s Influence

Eds:  Bliss Carman, et al.

http://www.bartleby.com/360/5/9.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: