వస్త్రధారణలో స్వేచ్ఛ… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి

(ఈ కవిత తీసుకున్న ‘ఎపిసీన్ ‘ (మౌన సుందరి) లోని విశేషం, ఆ కథకీ, కన్యాశుల్కంలోని ఒక ప్రథానమైన సంఘటనకీ సారూప్యం ఉంది. ఇందులోనూ అబ్బాయికి అమ్మాయివేషంవేసి ఒక వయసుమళ్ళిన వ్యక్తికి పెళ్ళిచెయ్యడం ఉంది. ఆ కథ ఇక్కడ చదవండి )  

***

ఏదో విందుకి వెళుతున్నట్టు ఇంకా చక్కగా
కనిపిద్దామనీ, ఇంకా మంచిదుస్తులేసుకుందామనీ;
ఇంకా సువాసనలద్దుకుని సుగంధం పూసుకునే
నీ ప్రయత్నాల ఆంతర్యం తెలియకపోయినా
ఊహిస్తున్నాను; కానీ, ఓ తరుణీ
అన్నీ మనోహరంగానూ, యోగ్యంగానూ లేవు.

నిరాడంరతలోని సౌందర్యాన్ని తెలిపేలా
ఒకసారి కనిపించు, ఒక చూపుచూడు ;
ఈ అలంకరణలలోని ఆకర్షణ కంటే
గాలికి స్వేచ్ఛగా ఎగిరే జుత్తూ,
వదులుగా తేలియాడే దుస్తులలోని ప్రమత్త
సౌందర్యం నా మనసు దోచుకుంటుంది.
ఈ మెరుగులు దృష్టినే గాని మనసుని ఆకర్షించలేవు.
.

బెన్ జాన్సన్

 11 June 1572 – 6 August 1637

ఇంగ్లీషు కవి

 

.

Freedom in Dress

.

Still to be neat, still to be drest,

As you were going to a feast;

Still to be powdered, still perfumed,—

Lady, it is to be presumed,

Though art’s hid causes are not found,

All is not sweet, all is not sound.

Give me a look, give me a face,

That makes simplicity a grace;

Robes loosely flowing, hair as free,—

Such sweet neglect more taketh me

Than all the adulteries of art:

They strike mine eyes, but not my heart.

.

(From “Epicœne; or, the Silent Woman,” Act I. Sc. 1.)

Ben Jonson

( 11 June 1572 – 6 August 1637)

English Poet

Poem Courtesy:

The World’s Best Poetry. 1904.
Volume VII. Descriptive: Narrative.  Descriptive Poems: II. Nature and Art

Eds:   Bliss Carman, et al.

http://www.bartleby.com/360/7/91.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: