ఆ గోడమీద పిల్లికూనలు కనిపిస్తున్నాయా చక్కని వెలుతురుతో, హాయిగా ఉన్న ఈ ఉదయం అతిచల్లని ప్రశాంతమైన వాతావరణంలో ఎల్డర్ చెట్టునుండి ఒకటి… రెండు… మూడు… ఒకటొకటిగా రాలుతున్న పండుటాకులతో అవి ఆడుకుంటున్నాయి…
ఒకసారి గమనించు, ఓ పిల్లికూన ఎలా ప్రారంభించి ఒళ్ళుకూడదీసుకుని, కాళ్ళు ఒక్కసారి సాగదీసి పంజాతో నేలని దువ్వి ఒక్కసారి దూకుతోందో పెద్దపులిలా ఒక దూకుదూకి రాలనున్న తన వేటని మధ్యదారిలోనే అందుకుంటోంది, అది ఎంత త్వరగా రాలినా ఫర్వాలేదు, అది దాని గుప్పిట తప్పించుకోలేదు.
ఇప్పుడది మూడవ, నాల్గవ విన్యాసం చెయ్యబోతోంది అలనాటి భారతదేశపు ఐంద్రజాలికుడిలా; అతను తనకళలో ఎంత హస్తలాఘవం కనబరుస్తాడో ఈ పిల్లికూన తనకేళిలో అంతచురుకుదనం చూపిస్తోంది; అక్కడ వెయ్యిమంది ప్రేక్షకులుంటే ఉందురుగాక, టాబీ వాళ్ళని ఎందుకు లక్ష్య పెడుతుంది? . విలియం వర్డ్స్ వర్త్ 7 ఏప్రిల్ 1770 – 23 ఏప్రిల్ 1850 ఇంగ్లీషు కవి