పల్లె పదాలు… సరీజినీ నాయుడు, భారతీయ కవయిత్రి

నా దుత్తలు నింపుకున్నా, చాలాదూరం మోసుకుపోవాలి

తోడులేని సుదీర్ఘమైన ఒంటరి దారి,

కానీ ఈ ఓడ సరంగు పాట నన్నెందుకు బులిపిస్తోంది?

దారికి అడ్డంపడి నన్నెందుకు ముందుకి పోనివ్వదు?

అయ్యో అప్పుడే చీకటిపడిపోతోంది.

ష్! వినండి. ఏమిటది? తెల్లకొంగ పిలుపా?

లేక, గుడ్లగూబ అరుపా?

దారి చూపించడానికి మసక వెన్నెలైనా లేదు

ఈ చీకట్లో న న్నేపురుగైనా కరిస్తే?

లేక ఏ భూతమో నన్ను మొడితే?

రామా! హే రామా! నేను చచ్చిపోతాను!

మా సోదరుడు గొణుగుతాడు “ఎక్కడ తిరుగుతోందిది?” అని 

మా అమ్మ నాకోసం చూస్తూ ఏడుస్తూ ఉంటుంది, వెయ్యి దేవుళ్లకు

“యమునలో నీళ్ళు బాగా లోతు,

నా కూతురు క్షేమంగా తిరిగొచ్చేట్టు చూడండి!” అని మొక్కుతూ.

యమునలో నీళ్ళు తొందరగా ప్రవహిస్తాయి

సాయంత్రం చీకట్లు దట్టంగా ముసురుకుంటాయి

మందలుగా వాలుతూ నల్లకాకులు ఆకాశాన్ని మూస్తున్నట్లు…

అమ్మో! ఇప్పుడు తుఫాను వస్తే నా గతేంగాను?

పిడుగు పైన పడకుండా ఎక్కడ దాక్కోను?

ఓ ప్రభూ నా అడుగులు నువ్వు కనిపెడుతూ దారి చూపించకపొతే,

రామా! ఓ రామా! నేను చచ్చిపోతాను!

.

సరోజినీ నాయుడు

(13 February 1879 – 2 March 1949)

భారతీయ కవయిత్రి

Village Songs
.

Full are my pitchers and far to carry,
Lone is the way and long,
Why, O why was I tempted to tarry
Lured by the boatmen’s song?
Swiftly the shadows of night are falling,
Hear, O hear, is the white crane calling,
Is it the wild owl’s cry?

There are no tender moonbeams to light me,
If in the darkness a serpent should bite me,
Or if an evil spirit should smite me,
Ram re Ram! I shall die.

My brother will murmur, ” Why doth she linger? ”
My mother will wait and weep,
Saying, ” O safe may the great gods bring her,
The Jamuna’s waters are deep. ” …
The Jamuna’s waters rush by so quickly,
The shadows of evening gather so thickly,
Like black birds in the sky …
O! if the storm breaks, what will betide me?
Safe from the lightning where shall I hide me?
Unless Thou succour my footsteps and guide me,
Ram re Ram! I shall die.
.
Sarijini Naidu Chattopadhyay
(13 February 1879 – 2 March 1949)
Indian Poetess

Poem Courtesy: https://www.poetrynook.com/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: