నా మతం… హోవర్డ్ ఆర్నాల్డ్ వాల్టర్, అమెరికను కవి
నేను నిజాయితీగా ఉంటాను, నన్ను నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారు గనుక;
నేను నిర్మలంగా ఉంటాను, నేనంటే పట్టించుకునేవారు ఉన్నారు గనుక;
నేను దృఢంగా ఉంటాను, బాధపడటానికి మున్ముందు చాలా ఉంది గనుక;
నేను ధైర్యంగా ఉంటాను, సాహసంతో ఎదిరించవలసింది ఉంది గనుక;
నేను అందరికీ మిత్రుడుగా ఉంటాను … శత్రువుకీ, స్నేహితులు లేనివాళ్ళకీ;
నేను అందరికీ అన్నీ ఇస్తూ, ఇచ్చిన విషయం మరిచిపోతాను ,
నేను వినయంగా ఉంటాను, నా బలహీనతలు నాకు తెలుసు గనుక;
నేను తలెత్తి చూసి, ప్రేమతో నవ్వుతూ ముందుకు పోతాను.
నేను నిజాయితీగా ఉంటాను, నన్ను నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారు గనుక;
నేను నిర్మలంగా ఉంటాను, నేనంటే పట్టించుకునేవారు ఉన్నారు గనుక;
నేను దృఢంగా ఉంటాను, బాధపడటానికి మున్ముందు చాలా ఉంది గనుక;
నేను ధైర్యంగా ఉంటాను, సాహసంతో ఎదిరించవలసింది ఉంది గనుక;
నేను అందరికీ మిత్రుడుగా ఉంటాను … శత్రువుకీ, స్నేహితులు లేనివాళ్ళకీ;
నేను అందరికీ అన్నీ ఇస్తూ, ఇచ్చిన విషయం మరిచిపోతాను ,
నేను వినయంగా ఉంటాను, నా బలహీనతలు నాకు తెలుసు గనుక;
నేను తలెత్తి చూసి, ప్రేమతో నవ్వుతూ ముందుకు పోతాను.
.
హోవర్డ్ ఆర్నాల్డ్ వాల్టర్
(19 August 1883 – 1 November 1918)
అమెరికను కవి
.
My Creed
.
I would be true, for there are those who trust me;
I would be pure, for there are those who care;
I would be strong, for there is much to suffer;
I would be brave, for there is much to dare.
I would be friend of all—the foe, the friendless;
I would be giving, and forget the gift,
I would be humble, for I know my weakness,
I would look up, and love, and laugh and lift.
I would be true, for there are those who trust me;
I would be pure, for there are those who care;
I would be strong, for there is much to suffer;
I would be brave, for there is much to dare.
I would be friend of all—the foe, the friendless;
I would be giving, and forget the gift,
I would be humble, for I know my weakness,
I would look up, and love, and laugh and lift.
.
Howard Arnold Walter
(19 August 1883 – 1 November 1918)
American
https://www.poetrynook.com/poem/my-creed
జీవితంలో అతిముఖ్యమైన విషయం… గ్రెన్ విల్ క్లీజర్, కెనేడియన్ అమెరికను కవి
నీకు ఏదో ఒక విషయం చెబుదామనిపించి
అది చెబితే విచారించవలసి వస్తుందనీ తెలిసి,
లేదా, ఒక అవమానం తీవ్రంగా పరిగణించి,
అది అంత త్వరగా మరిచిపోలేననుకున్నప్పుడు
అదే సరియైన తరుణం, నీ విచారాన్ని అణుచుకుని
మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యడానికి,
ఎందుకంటే, మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే
మన చెడు ఆలోచనలన్నీ అణగారిపోతాయి.
కోపం తెచ్చుకోవడం చాలా సుళువు
ఒకరు మనని మోసగించినపుడూ, ఎదిరించినపుడూ;
మనం కోరిన కోరికలు నెరవేర్చనపుడు
చిటపటలాడుతూ, నిరుత్సాహపడడం సహజం;
కానీ, మన స్వార్థం మీదా, ఈర్ష్యమీదా
అర్థవంతమైన విజయం సాధించాలంటే
మనం రాజీలేని మౌనాన్ని పాటించడం నేర్చుకోవాలి
తప్పు మనలో లేదని తెలిసినప్పటికీ.
కనుక, శత్రువు నిన్ను ప్రతిఘటించినపుడు
నీ సంయమనాన్ని కోల్పోకూడదు.
అది దొంగచాటుదెబ్బ తీసే శత్రువైనా
లేదా, మీకు తెలిసిన ఏ ప్రమాదమైనా సరే!
మీ చుట్టూ ఎంత కలకలం రేగుతున్నా
మీరు నిగ్రహంతో ప్రశాంతంగా ఉండగలిగినంతసేపూ
మీ జీవితంలో అతిముఖ్యమైన విషయంలో
మీరు పట్టు సాధించేరన్న విషయం మరిచిపోవద్దు.
.
గ్రెన్ విల్ క్లీజర్
1868– 27th August 1953
కెనేడియన్ అమెరికను కవి
.
The Most Vital Thing in Life
.
When you feel like saying something
— That you know you will regret,
Or keenly feel an insult
— Not quite easy to forget,
That’s the time to curb resentment
— And maintain a mental peace,
For when your mind is tranquil
— All your ill-thoughts simply cease.
It is easy to be angry
— When defrauded or defied,
To be peeved and disappointed
— If your wishes are denied;
But to win a worthwhile battle
— Over selfishness and spite,
You must learn to keep strict silence
— Though you know you’re in the right.
So keep your mental balance
— When confronted by a foe,
Be it enemy in ambush,
— Or some danger that you know.
If you are poised and tranquil
— When all around is strife,
Be assured that you have mastered
— The most vital thing in life.
.
Grenville Kleiser
1868– 27th August 1953
Canadian-American
Poem Courtesy:
https://www.poetrynook.com/poem/most-vital-thing-life
బట్టలారవేసుకునే దండెం… చార్లెట్ డ్రూయిట్ కోల్
చేతిలో చెయ్యివేసుకుని ఒక వరుసలో గెంతుతాయి
ఇటూ అటూ, ముందుకీ వెనక్కీ, దండెం మీద బట్టలు
తప్! తపా తప్! అంటూ గాలికి కొట్టుకుంటాయి
మంచుసోనలాంటి తెల్లనైన రెపరెపలాడే శాల్తీలు
బెదురుతున్న గుర్రాల్లా దుముకుతూ యెగిసిపడుతుంటాయి
జానపదకథల్లో మంత్రగత్తెల్లా వెర్రిగా గెంతుతుంటాయి
ముందుకి గుండ్రంగా, వెనక డొల్లగా
అవి ఆహ్లాదకరమైన మార్చి పిల్లగాలికి వణుకుతూ, దాటుతుంటాయి.
ఒకటి అలా పిచ్చిగా గెంతడం చూశాను
అది విడిపించుకునే దాకా తెగ గింజుకోవడం.
అంతే, దండానికున్న క్లిప్పుల్ని వాటిమానాన వాటిని వదిలేసి
పక్షిలా రెక్కలుజాపుకుంటూ ఎవరికీ దొరక్కుండా ఎగిరిపోయింది
మంచి ఎండలో తెరచాపలా అది ఎగరడం నేను చూసేను
సరదాకి వొంకరలు పోతూ, తపతపకొట్టుకుంటూ, దబ్బున జారిపోతూ.
ఇప్పుడది ఎక్కడుందో ఎవరికీ తెలీదు
సముద్రంలో మునిగిపోయిందో, కాలువలో పడిపోయిందో.
ఇందాకటి వరకు అది నా చేతిరుమాలుగా ఉండేది
అది తిరిగి నా జేబులోకి చేరదని మాత్రం నాకు తెలుసు.
.
ఛార్లెట్ డ్రూయిట్ కోల్
(ఈ కవయిత్రి గురించి సరియైన సమాచారం ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను )
.
The Clothes-Line
.
Hand in hand they dance in a row,
Hither and thither, and to and fro,
Flip! Flap! Flop! And away they go—
Flutt’ring creatures as white as snow,
Like restive horses they caper and prance;
Like fairy-tale witches they wildly dance;
Rounded in front, but hollow behind,
They shiver and skip in the merry March wind.
One I saw dancing excitedly,
Struggling so wildly till she was free,
Then, leaving pegs and clothes-line behind her,
She flew like a bird, and no one can find her.
I saw her gleam, like a sail, in the sun,
Flipping and flapping and flopping for fun.
Nobody knows where she now can be,
Hid in a ditch, or drowned in the sea.
She was my handkerchief not long ago,
But she’ll never come back to my pocket, I know.
.
Charlotte Druitt Cole
(I deeply regret I could not get any reliable information about this poetess)
Poem Courtesy:
https://www.poetrynook.com/poem/clothes-line
ఈ రోజు ఎంత బాగుంది? … డగ్లస్ మలోష్, అమెరికను కవి
నిజమే! ఈ ప్రపంచం కష్టాలమయం
అవి లేవని నే ననలేదు.
దేవుడా!నాకు చాలినన్ని కష్టాలున్నాయి,
మొరపెట్టుకుందికి రెండింతల కారణాలు.
వర్షాలూ, తుఫానులూ చిరాకు పెట్టేవి
ఆకాశం ఎప్పుడూ మేఘావృతమై ఉండేది
నా మార్గం నిండా ముళ్ళూ
ముళ్ళకంపలూ నిండి ఉన్నాయి
అయితేనేం, ఈ రోజు బాగులేదూ?
ఎప్పుడూ ఏడుస్తూ కూచుంటే లాభమేమిటి?
బాధలు ఇంకా కొనసాగించడం తప్ప?
ఎప్పుడూ గతాన్ని మనసులో పెట్టుకుని
చింతిస్తే లాభమేమిటి?
ఎవరికి వాళ్ళ బాధలుంటాయి
సుఖాలూ కష్టాలతో పలచబడుతూనే ఉంటాయి
జీవితం, వేడుకచేసుకుందికేమీ లేదు
కష్టాలంటావా? నా పాలు నాకున్నాయి.
అయినా సరే, ఈ రోజు చాలా బాగుంది!
నేను బ్రతుకున్నది ఈ క్షణంలోనే
నెల్లాళ్ళక్రిందట కాదు.
పొందడం, పోగొట్టుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం,
కాలం ఎలా నడిపిస్తే అలా.
నిన్న ఒక దుఃఖ మేఘం
నా మీద బాగా కురిసింది;
రేపు మళ్ళీ వర్షించవచ్చు;
అయినా సరే నే నంటాను
ఈ రోజు బాగులేదూ? అని.
.
డగ్లస్ మలోష్,
(May 5, 1877 – July 2, 1938)
అమెరికను కవి
.
Douglas Malloch
Photo Courtesy:
http://www.azquotes.com/author/18028-Douglas_Malloch .
Ain’t It Fine Today
.
Sure, this world is full of trouble —
I ain’t said it ain’t.
Lord, I’ve had enough and double
Reason for complaint;
Rain and storm have come to fret me,
Skies are often gray;
Thorns and brambles have beset me
On the road — but say,
Ain’t it fine today?
What’s the use of always weepin’,
Making trouble last?
What’s the use of always keepin’
Thinkin’ of the past?
Each must have his tribulation —
Water with his wine;
Life, it ain’t no celebration,
Trouble? — I’ve had mine —
But today is fine!
It’s today that I am livin’,
Not a month ago.
Havin’; losin’; takin’; givin’;
As time wills it so.
Yesterday a cloud of sorrow
Fell across the way;
It may rain again tomorrow,
It may rain — but say,
Ain’t it fine today?
.
Douglas Malloch
(May 5, 1877 – July 2, 1938)
American Poet
Poem Courtesy: https://www.poetrynook.com/poem/aint-it-fine-today
రెండు పిల్లి పిల్లలు… జేన్ టేలర్, ఇంగ్లీషు కవయిత్రి
రెండు పిల్లి పిల్లల మధ్య
ఒక తుఫానురాత్రి
ప్రారంభిమైన తగవులాట
పెరిగి, కొట్టుకునేదాకా వచ్చింది.
ఒకదాని దగ్గర ఎలక ఉంది
రెండోదాని దగ్గర లేదు,
అసలీ తగవంతటికీ
మూలకారణం అదే!
“ఆ ఎలుక నా క్కావాలి,”
అంది రెండింటిలో పెద్దది
“నీకు ఎలక కావాలేం?
అదెలా జరుగుతుందో చూద్దాం!”
“ఆ ఎలక నెలాగైనా తీసుకుంటాను,”
అంది ‘తాబేలు డిప్ప’
అని, ఉమ్ముతూ, గీకుతూ
దాని చెల్లెలుమీద దూకింది.
నే చెప్పినదంతా ఆ రాత్రి
తుఫాను రాకముందు పిల్లిపిల్లలు
రెండూ తగవులాడుకోడం
ప్రారంభించినప్పటి సంగతి.
ఈ లోపున ముసలావిడ
తుడుచుకునే చీపురుకట్ట తీసి
రెండింటినీ గది అవతలకి
గట్టిగా విసిరేసింది.
అక్కడ నేలంతా
మంచుతో తడిసిఉంది
నోటిదగ్గరకూడు పోయింది
వెళ్ళడానికి వేరే దారి లేదు.
అందుకని తలుపుమాటున
వణుకుతూ నిలుచున్నాయి
ఆ ముసలామె గది తుడుపు
పూర్తి అయ్యేదాకా.
రెండూ మెల్లగా ఎలకల్లా
చడీచప్పుడులేకుండా లోనకొచ్చాయి
ఒంటినిండా మంచుతో
ఒళ్ళంతా చలిపట్టుకుపోయి
ఆ తుఫాను రాత్రి
తగవులాడుకుని తన్నుకోవడంకంటే
పొయ్యిదగ్గర చలికాచుకోవడం
ఉత్తమమని తెలుసుకున్నాయి.
.
జేన్ టేలర్
(23 September 1783 – 13 April 1824)
ఇంగ్లీషు కవయిత్రి
“ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్” ద్వారా ప్రఖ్యాతి వహించింది.

English Poetess
‘Twinkle Twinkle Little Star’ Fame.