కామన… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి

ఒంటిగా ఉయ్యాలలూగెడివాడా!
నీదేమిటో తెలిసిన స్వామీ!
ఓ సర్వజ్ఞుడా,
ఊయలనుండి పాడెదాకా
రక్షంచు, ప్రభూ, నన్ను రక్షించు!

ఈ ప్రపంచపు వ్యామోహాలనుండీ
ఇక్కడి విపత్తులనుండీ
మేము నిరంతరం తపించి కృశించే
తీవ్ర ఆవేదనలనుండీ,
మృత్యువంత బరువైనదీ
సమాధి అంత చల్లనిదీ అయిన
మా లోలోపలికి చొచ్చుకుపోయి
మమ్ము వివశుల్ని చేసే జడత్వం నుండి
కాపాడు, మహప్రభో, కాపాడు!

ఆప్తమిత్రుడు ‘గర్వం’ 
పక్కన తోడుగా నడుస్తుంటే
ఈ ఆత్మ నిష్కల్మషమౌతున్నకొద్దీ
భగవంతుని దరిదాపులోకూడా కనలేదో,
ఈ ఆత్మ ఎత్తు ఎదుగుతున్న కొద్దీ
దైవానికి కనుచూపుమేరలో చేరుకోలేదో,
అది ఈ ఆత్మ చేసే ప్రయత్నాలు వమ్ముచేస్తూ
దాని చురుకైన కళ్ళకు పొరలుకప్పుతుందో
ఆనందంతో కేరింతలెస్తూ,
ఆరాధనకి విగ్రహాలు సృష్టిస్తుందో
ఆత్మ తనని తాను సమర్పించుకునే
హృదయదఘ్నమైన భావనని
కేవలం చర్మమంత ఉపరితలభావనగా
తన మాటల నైపుణ్యంతో దిగజార్చుతుందో
తిరుగులేని మోసాలకీ
తిరుగుబాటులేని దాస్యానికీ గురిచేస్తుందో…
ఆ స్థితినుండి స్వామీ, నన్ను రక్షించు, రక్షించు!

మట్టిలో పుట్టి
మట్టి తత్త్వాన్ని జీర్ణించుకున్న
నువ్వు సృష్టించిన ఈ జీవిని
దుఃఖం నుండీ… అదికేవలం ఒక రాగం,
వేడుకలనుండీ… అవి కేవలం నటన
కన్నీటినుండీ… అవి స్వస్థతచేకూర్చవు
అర్థంలేని ఆరోపణలనుండీ
నీ శక్తిని ప్రదర్శించి
స్వామీ, కాపాడు, నన్ను కాపాడు!

అన్నీ రెండుగా కనిపించే ద్వైదీభావనలనుండి
ఎక్కడ ధీమంతులు కూడా తప్పటడుగువెస్తారో,
ఎక్కడ ఊరట సంకటంగా పరిణమిస్తుందో
ఎక్కడ సద్వర్తనులకి అన్యాయం జరుగుతుందో
ఎక్కడ విషాదం ఆనందాన్ని కాలరస్తుందో
ఎక్కడ తియ్యదనం అంతలోనే వెగటుపుట్టిస్తుందో
ఎక్కడ నమ్మకాలు (పునాదులులేని)మట్టిపై నిర్మించబడుతాయో
ఎక్కడ ప్రేమ సగం అనుమానంతో ఉంటుందో
నిర్వీర్యమై, అలమటించే నన్ను, దయాసాగరుడవై
తప్పించు, ప్రభూ, మమ్ము తప్పించు.

బలహీనమైన మా మనసులు
నిరంతరం కొట్టుమిట్టాడేచోట
మా పాడు ఆలోచనలు పోతే పోనీ,
ఎక్కడ నీ గొంతు వినిపిస్తుందో
అక్కడ సందేహాల నోరు మూతపడనీ
అన్ని మాటలూ సాధువుగా
అన్ని కలహాలూ నివారింపబడి
అన్ని బాధలూ ఏమారి
వెలుగు కళ్ళకు గుడ్డిదనాన్నీ
ప్రేమ ద్వేషాన్నీ
జ్ఞానం వినాశాన్నీ
భయం తప్పిదాలనీ తీసుకురాకుండా
ఊయలనుండి, పాడె దాకా
రక్షించు, ప్రభూ, రక్షించు !

.

మాత్యూ ఆర్నాల్డ్

(24 December 1822 – 15 April 1888)

ఇంగ్లీషు కవి

Mathew Arnold
Image Courtesy: Project Gutenberg

.

Desire

.

Thou, who dost dwell alone;

Thou, who dost know thine own;    

Thou, to whom all are known,

From the cradle to the grave,—       

    Save, O, save!         

From the world’s temptations;        

From tribulations;         

From that fierce anguish         

Wherein we languish;    

From that torpor deep          

Wherein we lie asleep,  

Heavy as death, cold as the grave,—

    Save, O, save! 

When the soul, growing clearer,       

Sees God no nearer;              

When the soul, mounting higher,     

To God comes no nigher;       

But the arch-fiend Pride

Mounts at her side,       

Foiling her high emprize,                

Sealing her eagle eyes,  

And, when she fain would soar,       

Make idols to adore;     

Changing the pure emotion    

Of her high devotion,            

To a skin-deep sense     

Of her own eloquence;  

Strong to deceive, strong to enslave,—     

    Save, O, save! 

From the ingrained fashion            

Of this earthly nature    

That mars thy creature;

From grief, that is but passion;        

From mirth, that is but feigning;      

From tears, that bring no healing;            

From wild and weak complaining;—         

Thine old strength revealing,  

    Save, O, save! 

From doubt, where all is double,     

Where wise men are not strong;               

Where comfort turns to trouble;      

Where just men suffer wrong;

Where sorrow treads on joy;  

Where sweet things soonest cloy;    

Where faiths are built on dust;         

Where love is half mistrust,    

Hungry, and barren, and sharp as the sea;

    O, set us free!  

O, let the false dream fly        

Where our sick souls do lie,           

Tossing continually.     

O, where thy voice doth come,         

Let all doubts be dumb;

Let all words be mild;   

All strife be reconciled;         

All pains beguiled.        

Light brings no blindness;      

Love no unkindness;     

Knowledge no ruin;      

Fear no undoing,         

From the cradle to the grave,—       

    Save, O, save!

.

Matthew Arnold

(24 December 1822 – 15 April 1888)

English Poet

Poem courtesy: http://www.bartleby.com/360/4/77.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: