ఆఖరి ఆకు… అలెగ్జాండర్ పూష్కిన్, రష్యను కవి
నా బ్రతుకు కోరికల పరిధి దాటింది
నా వ్యామోహాలుతలుచుకుంటే విసుగేస్తోంది;
శూన్యహృదయ జనితాలైన
దుఃఖాలొక్కటే చివరకి మిగిలేది.
నా అధికార తీరాలపై
విధి రేపే క్రూరమైన తుఫానుల నీడలో
నా తుది ఘడియకోసం ఎదురుచూస్తూ
దుఃఖభరితమైన ఒంటరి బతుకు ఈడుస్తున్నాను.
ఆవిధంగా, శీతగాలి ఊళలేస్తూ
చలితో కోతపెడుతుంటే
ఆఖరిఆకు మాత్రమే మిగిలి మోడుబారిన
కొమ్మ … గజగజా వణుకుతోంది.
.
అలెగ్జాండర్ పూష్కిన్
6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837
రష్యను కవి
.
