సంశయాత్మ … ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
ఈ పిచ్చుకలు ఎక్కడికి వలస పోయాయి? కొంపదీసి ఏ చీకటి తుఫాను తీరాలలోనో తడిసి వణుకుతూ మరణించలేదు గద! ఈ పూలు ఎందుకు వాడిపోవాలి? ఓ సంశయాత్మా! కన్నీటి వర్షాన్ని లెక్కచేయకుండా ఈ చలిపీఠాలలో ఎందుకు బందీలై ఉండాలి? ఒకవంక నీ పెదాలపై చిరునవ్వు మొలిపించడానికి శీతగాలులు వీచుతుంటే తెల్లపిల్లిలాంటి మెత్తని మంచుక్రింద అవి కేవలం నిద్రిస్తున్నాయి
ఇన్నాళ్ళూ సూర్యుడు తన కిరణాల్ని దాచుకున్నాడు ఓ నా పిరికి మనసా! ఈ ప్రపంచాన్ని నైరాశ్యపు ఋతువు విడిచిపెట్టదా? అంతటి ప్రకాశవంతమైన ఆకాశాన్నీ అప్పుడే తుఫాను మేఘాలు కమ్ముకుంటున్నాయి. త్వరలోనే, శలవుతీసుకుంటున్న వసంతం పసిడి కాంతుల గ్రీష్మాన్ని తట్టిలేపనుంది.
నిజమైన ఆశ అణగారిపోయింది. చీకటి వెలుగుతో దాహాన్ని తీర్చుకుంటోంది. నిరాశానిస్పృహల నీరవాన్ని ఏ శబ్దం చేదించగలదు? ఓ నా అనుమానపు మనసా! ఆకాశం మేఘావృతమై ఉంది చివరకి చుక్కలు పొడచూపక మానవు. గతించిన చీకటిని వెలిగిస్తూ దేవదూతల సరసభాషణని గాలి మోసుకొస్తోంది. . ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్
స్పందించండి