రోజు: మార్చి 25, 2018
-
సంశయాత్మ … ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
ఈ పిచ్చుకలు ఎక్కడికి వలస పోయాయి? కొంపదీసి ఏ చీకటి తుఫాను తీరాలలోనో తడిసి వణుకుతూ మరణించలేదు గద! ఈ పూలు ఎందుకు వాడిపోవాలి? ఓ సంశయాత్మా! కన్నీటి వర్షాన్ని లెక్కచేయకుండా ఈ చలిపీఠాలలో ఎందుకు బందీలై ఉండాలి? ఒకవంక నీ పెదాలపై చిరునవ్వు మొలిపించడానికి శీతగాలులు వీచుతుంటే తెల్లపిల్లిలాంటి మెత్తని మంచుక్రింద అవి కేవలం నిద్రిస్తున్నాయి ఇన్నాళ్ళూ సూర్యుడు తన కిరణాల్ని దాచుకున్నాడు ఓ నా పిరికి మనసా! ఈ ప్రపంచాన్ని నైరాశ్యపు ఋతువు విడిచిపెట్టదా?…