అమ్మ కాని అమ్మ … గ్వెండొలీన్ బ్రూక్స్, అమెరికను కవయిత్రి


గర్భస్రావాలు మిమ్మల్ని ఒకంతట మరిచిపోనివ్వవు.

మీ కడుపున పడి, భూమ్మీదపడని పిల్లలు మీకు గుర్తుంటారు,

ఆ చిన్న తడి మాంసపు ముద్దలు జుత్తు ఉండీ, లేకనో,

ఎన్నడూ ఊపిరికి నోచుకోని ఆ పాటగాళ్ళూ, పనివాళ్ళూ.

మీరు ఎన్నడూ వాళ్లని నిర్లక్ష్యం చెయ్యలేరు, కొట్టలేరు

వాళ్ళకి మిఠాయిలు కొనీ, మరోలా నోరు మూయించలేరు.

చీకుతున్న బొటనవేలు నోట్లోంచి పక్కకి తప్పించలేరు

వాళ్ళని భయపెట్టే దయ్యాలనీ భూతాల్ని పారద్రోలనూ లేరు.

ప్రేమగా నిట్టూరుస్తూ వాళ్ళని విడిచిపెట్టనూ లేరు

కంటితో చూసి పిల్లలఆకలి ఎరిగిన తల్లిలా తినడానికి ఏమీ ఇవ్వలేరు.

నేను ఆ గాలి గుసగుసల్లో నిరాకారులైన పిల్లల గొంతు విన్నాను

నేను ఒక్కసారి కుంచించుకుపోయాను. నా గుండెలపై

పెదవులాన్చని నా ప్రియశిశువులను వదులుకున్నాను.

ప్రియమైన బిడ్డలారా! నేను పండగచేసుకుంటే,

నేను మీ అదృష్టాన్ని చిదిమేస్తే

మీ జీవితాల్ని మీ చేతికి అందకుండా లాక్కుంటే

మీ పుట్టుకలనీ, మీ పేర్లనీ,

మీ శైశవరోదనలనీ, మీ ఆటపాటల్నీ

మీ అద్భుతమైన, అందమైన ప్రేమప్రకటనలనీ,

మీ అల్లరులూ, మీ పెళ్ళిళ్ళూ, మీ బాధలూ, మీ చావులూ,

అసలు మీ జీవితపు తొలిశ్వాసల్నే విషపూరితం చేసేనంటే,

“నా ఇష్టపూర్వకంగా” చేసిన వాటిలో నా ఇష్టం లేదని నమ్మండి!

నిజానికి ఎందుకు ఏడవాలి అని అనుకున్నా,

ఈ నేరం నాదికాదని ఏడుస్తున్నానా?

మీరెలాగూ చనిపోయారు కాబట్టి…

లేదు… మరోలా చెప్పాలంటే,

మీరెన్నడూ పూర్తిగా రూపుదిద్దుకోలేదు కాబట్టి,

ఉహూఁ! అదికూడా పొరపాటేనేమో! 

అదీ తప్పే; ఓహ్! సరిగ్గా ఎలా చెప్పడం? వాస్తవాన్ని మాటల్లో ఎలా చెప్పను?

మీరు పుట్టేరు, మీకు శరీరం ఉంది, మీరు చనిపోయేరు.

మీరెన్నడూ ముసిముసి నవ్వులు నవ్వలేదు, పుట్టాలనుకోలేదు, ఏడవనూ లేదు.

నా మాట నమ్మండి! మీ రందరూ నాకు ప్రాణం.

నా మాట నమ్మండి! మీరందరూ నాకు తెలుసు, లీలామాత్రంగా నైనా!

నేము మిమ్మల్నందర్నీ మనసారా ప్రేమించేను! 

.

గ్వెండొలీన్ బ్రూక్స్

(June 7, 1917 – December 3, 2000)

అమెరికను కవయిత్రి

 

.

The Mother

 *

Abortions will not let you forget.

You remember the children you got that you did not get,  

The damp small pulps with a little or with no hair,  

The singers and workers that never handled the air.  

You will never neglect or beat

Them, or silence or buy with a sweet.

You will never wind up the sucking-thumb

Or scuttle off ghosts that come.

You will never leave them, controlling your luscious sigh,  

Return for a snack of them, with gobbling mother-eye.

I have heard in the voices of the wind the voices of my dim killed children.

I have contracted. I have eased

My dim dears at the breasts they could never suck.

I have said, Sweets, if I sinned, if I seized

Your luck

And your lives from your unfinished reach,

If I stole your births and your names,

Your straight baby tears and your games,

Your stilted or lovely loves, your tumults, your marriages, aches, and your deaths,

If I poisoned the beginnings of your breaths,

Believe that even in my deliberateness I was not deliberate.  

Though why should I whine,

Whine that the crime was other than mine?—

Since anyhow you are dead.

Or rather, or instead,

You were never made.

But that too, I am afraid,

Is faulty: oh, what shall I say, how is the truth to be said?  

You were born, you had body, you died.

It is just that you never giggled or planned or cried.

Believe me, I loved you all.

Believe me, I knew you, though faintly, and I loved, I loved you All.

.

Gwendolyn Brooks 

(June 7, 1917 – December 3, 2000)

American 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: