కొన్ని రోజులు నా ఆలోచనలు తమలోతాము ముడుచుకుపోతాయి
చలికి ముడుచుకుపోయినట్టు, నీరసంగా, కళ్ళుమూసుకుని
నా మనసులోని మోడుబారిన చేట్లమీంచి
చినుకులు చుక్క చుక్కగా కారుతున్నట్టు వేలాడుతూ.
మరికొన్ని రోజులు అవి మెరుస్తూ తేలిపోతుంటాయి
గాలిలో స్వేచ్చగా రెక్కవిచ్చి మరీ ఎగురుతాయి
సున్నితమైన వాటి రెక్కల తాకిడికి
అంటిన బంగరు ధూళి నా కురుల్లో మెరుస్తుంది.
.
కార్ల్ విల్సన్ బేకర్
(1878–1960)
అమెరికను కవయిత్రి

Photo Courtesy: Wikipedia
Some Days
.
Some days my thoughts are just cocoons- all cold, and dull and blind,
They hang from dripping branches in the grey woods of my mind;
And other days they drift and shine – such free and flying things!
I find the gold-dust in my hair, left by their brushing wings.
Karle Wilson Baker
(1878- 1960)
American
Poem Courtesy: https://www.poemhunter.com/poem/days-3/
స్పందించండి