పూ రేకలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
జీవితం ఒక ప్రవాహం.
దానిమీద మన హృదయపుష్పపు రేకలను
ఒకటొకటిగా తెంపుతూ విడిచిపెడుతుంటాము;
వాటి గమ్యం మన కలలో మరుగైపోయినా
అవి మన కనుచూపుమేరవరకు తేలుతూ కనిపిస్తాయి.
ఆనందంగా సాగే వాటి ప్రయాణపు తొలి అడుగులు మాత్రమే మనం చూడగలం.
వాటిపై ఆశలబరువును మోపుతూ,
ఆనందంతో ఎరుపెక్కి
మనం గులాబీ తొలి రేకలను విరజిమ్ముతాం;
అవి ఎంతవరకు విస్తరిస్తాయో,
చివరకి అవి ఎలా వినియోగపడతాయో
మనకెన్నడూ తెలియదు. ఆ అనంత ప్రవాహం
వాటిని పక్కకి నెట్టివేస్తుంది,
ఒక్కొక్కటీ మరొకదానికి అందనంతగా
అనేక మార్గాలగుండా ప్రయాణిస్తుంది.
మనం మాత్రం ఉన్నచోటే కదలకుండా ఉంటాం
సంవత్సరాలు దొర్లిపోతాయి;
ఆ పువ్వు క్షణంలో మాయమవొచ్చు, దాని సుగంధం గాలిలో తేలే ఉంటుంది.
.
ఏమీ లోవెల్
అమెరికను కవయిత్రి

.
Petals
Life is a stream
On which we strew
Petal by petal the flower of our heart;
The end lost in dream,
They float past our view,
We only watch their glad, early start.
Freighted with hope,
Crimsoned with joy,
We scatter the leaves of our opening rose;
Their widening scope,
Their distant employ,
We never shall know. And the stream as it flows
Sweeps them away,
Each one is gone
Ever beyond into infinite ways.
We alone stay
While years hurry on,
The flower fared forth, though its fragrance still stays.
.
Amy Lowell
(February 9, 1874 – May 12, 1925)
American
Poem Courtesy:
A DOME OF MANY-COLOURED GLASS
The Project Gutenberg EBook of A Dome of Many-Coloured Glass, by Amy Lowell
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి