ఈ నేలపై తారకలు శాశ్వతం … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
భూమి తనలో తాను తిరిగిన ప్రతి రోజూ…
మనం ప్రేమించిన ఇల్లూ, ఇష్టపడిన వీధీ కనుమరుగైనా…
ఈ నేలపై తారకలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి
శరత్కాలపు విషువత్ నాటి రాత్రి మనకి
తెలిసిన రెండు చుక్కలు, సరిగ్గా అర్థరాత్రి వేళ
ఆకసంలో ఉచ్చస్థితికి చేరుకుంటాయి; జడత్వం గాఢమౌతుంది
ఈ నేలపై తారకలు శాశ్వతంగా ఉంటాయి
మనం నిద్రలోకి జారుకున్నా, తారకలు మాత్రం శాశ్వతం. .
.
సారా టీజ్డేల్
(8 August 1884 – 29 January 1933)
అమెరికను కవయిత్రి
.
There Will Be Stars
.
There will be stars over the place forever;
Though the house we loved and the street we loved are lost,