ఈ ఆకాశం క్రింద నా అంత ఆనందంగా ఎవరూ ఉండరు. నే ఒక వంద పుష్పాలు తాకుతాను కానీ, ఒక్కటీ తురుమను.
నేను మేఘాల్నీ, కొండ కొనకొమ్ముల్నీ ప్రశాంత వదనంతో తిలకిస్తాను. గాలి ఎలా పచ్చికని అవనతం చేస్తూ పోతుందో పచ్చిక తిరిగి ఎలా తలెత్తుకుంటుందో చూస్తాను.
దూరాన ఉన్న మా ఊరిలో దీపాలు వెలిగే వేళకి మా ఇల్లు ఎక్కడ ఉందా అని చూసి, గుర్తించి కొండ దిగడం ప్రారంభిస్తాను. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే అమెరికను కవయిత్రి (February 22, 1892 – October 19, 1950)