చిత్తరువులు … మారిన్ సొరెస్క్యూ, రుమేనియా కవి
మ్యూజియాలన్నిటికీ నేనంటే భయం:
ఎక్కడైనా నేను రోజల్లా ఒక చిత్రాన్ని
నిశితంగా పరిశీలిస్తానా,
మరుచటిరోజే, అది
మాయమైపోయిందని ప్రకటిస్తారు.
ప్రతిరోజూ, ప్రపంచంలో ఏదో ఒకచోట
నేను ఏదో ఒకటి దొంగిలిస్తుండగా పట్టుకుంటారు.
నా చెవుల్ని ఒరుసుకుంటూ తుపాకిగుళ్ళు పోతుంటాయి;
ప్రేమికులకి తమ ప్రేమికల
శరీరగంధం తెలిసినదానికంటే ఎక్కువగా
పోలీసు కుక్కలకి ఇప్పుడు
నా అడుగుల వాసన బాగా తెలుసు;
అయినా నేనేమీ చలించను.
నేను నా ప్రాణానికి ముప్పుతెచ్చిపెట్టే
తైలవర్ణచిత్రాలమీద గట్టిగా అరుస్తాను.
వాటిని మేఘాలమీదా, చెట్టుకొనలకీ వేలాడదీసి
వివిధభంగిమల్లో అవలోకిస్తాను.
గొప్ప ఇటాలియన్ చిత్రకారులతో మాటకలపడం సుళువు
వర్ణమిశ్రమాలగురించి ఏం మాటాడతార్రా బాబూ!
కనుకనే వాళ్ల సాంగత్యంలో
నన్ను సుళువుగా పోలికపట్టవచ్చు.
చిలకలు పట్టేవాడిని పోల్చుకున్నట్టు
దూరంనుండి నన్ను విని పసిగట్టవచ్చు.
అందరిలోకీ రెంబ్రాంట్ ని దొంగిలించడం కష్టం
అతన్ని పట్టుకుందామని చెయ్యి చాచుతావు, నీకు చీకటి చిక్కుతుంది.
నీకు గాభరా వేస్తుంది: అతని మనుషులకి శరీరాలుండవు
ఎక్కడో నేలమాళిగల్లో బంధించబడ్డ కళ్ళుమాత్రమే ఉంటాయి.
వాన్ గో చిత్రాలకి మతిపోతుంది.
అవి చూస్తే తల దిమ్మతిరిగి ప్రేమలో పడిపోతాం
మీ రెండుచేతుల్నీ పట్టుతప్పిపోకుండా గట్టిగా ప్రయత్నించాలి.
లేకపోతే చంద్రుడి ఆటుకి సముద్రంలా లోపలికి లాగేస్తాయి.
బ్రూగెల్ నన్నెందుకు ఏడిపిస్తాడు?
నాకంటే పెద్ద వయసున్నవాడు కాదే!
అయినా సరే అతన్ని అందరూ “పెద్ద”ని పిలుస్తారు.
కారణం, అతను చనిపోయాక పెద్దల్లో కలిసిపోయాడు.
నే నతడినుండి నేర్చుకుందికి ప్రయత్నిస్తుంటాను.
కానీ, నా కన్నీళ్ళని అతని బంగరు చిత్రాలపై పడకుండా ఆపనూలేను.
నేను దౌడుతీస్తూ, చంకలో ఋతువుల్ని దాచకుండా ఉండనూలేను.
నే చెప్పినట్టు
ప్రతిరోజూ నా నైపుణ్యానికి అసూయపడేలా
ఒక్కో చిత్రాన్ని దొంగిలిస్తుంటాను.
అయినా నా పరుగుకి అంతంలేదు.
చివరకి ఒక రోజు నేను దొరికిపోతాను.
అలసి, కుక్కలచే పీక్కుతినబడి
రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకుంటాను
చేతుల్లో చాలా హీనమైన అనుకరణచిత్రంతో…
.
మారిన్ సొరెస్క్యూ
29 February 1936 – 8 December 1996
రుమేనియా కవి

“Paintings”
.
All museums are afraid of me:
When I spend a whole day
Contemplating a painting
The following day they announce
It has disappeared.
Every day I am found stealing
In another part of the world
Yet I am unperturbed
By the bullets which whistle past my ears
And the police dogs
Which now know the smell of my steps
Better than lovers
The perfume of their beloved.
I talk loudly to the oil paintings
That endanger my life
I hang them up on the clouds and trees
Then step back to study the perspective.
With the Italian masters it’s easy to start a conversation
What a chatter of colours!
And so with them
I am easily detected
Heard and seen from a distance
As if I were carrying parrots.
The most difficult to steal is Rembrandt.
You reach to touch him and come upon darkness
You panic, his people have no bodies
Only. eyes locked in dark cellars.
Van Gogh’s canvases are mad
They swirl and turn head over heel
You must keep a tight grip With both hands
They are sucked in by some power of the moon.
Why should Breughel make me cry?
He was no older than me
Yet he was named the Elder
Because he was omniscient when he died.
I try to learn from him
But I can’t keep my tears
From running on his golden frames
As I escape, the seasons under my arm.
As I say
Each night I steal a painting
With a dexterity to be envied
And yet it is such a long way
And finally caught I am caught.
So home I come late at night
Tired, torn by dogs,
Bearing in my hands a cheap reproduction.
.
Marin Sorescu
29 February 1936 – 8 December 1996)
Romanian poet, playwright, and novelist.
(Translation by Constantin Roman)
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి