కామన… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
ఒంటిగా ఉయ్యాలలూగెడివాడా!
నీదేమిటో తెలిసిన స్వామీ!
ఓ సర్వజ్ఞుడా,
ఊయలనుండి పాడెదాకా
రక్షంచు, ప్రభూ, నన్ను రక్షించు!
ఈ ప్రపంచపు వ్యామోహాలనుండీ
ఇక్కడి విపత్తులనుండీ
మేము నిరంతరం తపించి కృశించే
తీవ్ర ఆవేదనలనుండీ,
మృత్యువంత బరువైనదీ
సమాధి అంత చల్లనిదీ అయిన
మా లోలోపలికి చొచ్చుకుపోయి
మమ్ము వివశుల్ని చేసే జడత్వం నుండి
కాపాడు, మహప్రభో, కాపాడు!
ఆప్తమిత్రుడు ‘గర్వం’
పక్కన తోడుగా నడుస్తుంటే
ఈ ఆత్మ నిష్కల్మషమౌతున్నకొద్దీ
భగవంతుని దరిదాపులోకూడా కనలేదో,
ఈ ఆత్మ ఎత్తు ఎదుగుతున్న కొద్దీ
దైవానికి కనుచూపుమేరలో చేరుకోలేదో,
అది ఈ ఆత్మ చేసే ప్రయత్నాలు వమ్ముచేస్తూ
దాని చురుకైన కళ్ళకు పొరలుకప్పుతుందో
ఆనందంతో కేరింతలెస్తూ,
ఆరాధనకి విగ్రహాలు సృష్టిస్తుందో
ఆత్మ తనని తాను సమర్పించుకునే
హృదయదఘ్నమైన భావనని
కేవలం చర్మమంత ఉపరితలభావనగా
తన మాటల నైపుణ్యంతో దిగజార్చుతుందో
తిరుగులేని మోసాలకీ
తిరుగుబాటులేని దాస్యానికీ గురిచేస్తుందో…
ఆ స్థితినుండి స్వామీ, నన్ను రక్షించు, రక్షించు!
మట్టిలో పుట్టి
మట్టి తత్త్వాన్ని జీర్ణించుకున్న
నువ్వు సృష్టించిన ఈ జీవిని
దుఃఖం నుండీ… అదికేవలం ఒక రాగం,
వేడుకలనుండీ… అవి కేవలం నటన
కన్నీటినుండీ… అవి స్వస్థతచేకూర్చవు
అర్థంలేని ఆరోపణలనుండీ
నీ శక్తిని ప్రదర్శించి
స్వామీ, కాపాడు, నన్ను కాపాడు!
అన్నీ రెండుగా కనిపించే ద్వైదీభావనలనుండి
ఎక్కడ ధీమంతులు కూడా తప్పటడుగువెస్తారో,
ఎక్కడ ఊరట సంకటంగా పరిణమిస్తుందో
ఎక్కడ సద్వర్తనులకి అన్యాయం జరుగుతుందో
ఎక్కడ విషాదం ఆనందాన్ని కాలరస్తుందో
ఎక్కడ తియ్యదనం అంతలోనే వెగటుపుట్టిస్తుందో
ఎక్కడ నమ్మకాలు (పునాదులులేని)మట్టిపై నిర్మించబడుతాయో
ఎక్కడ ప్రేమ సగం అనుమానంతో ఉంటుందో
నిర్వీర్యమై, అలమటించే నన్ను, దయాసాగరుడవై
తప్పించు, ప్రభూ, మమ్ము తప్పించు.
బలహీనమైన మా మనసులు
నిరంతరం కొట్టుమిట్టాడేచోట
మా పాడు ఆలోచనలు పోతే పోనీ,
ఎక్కడ నీ గొంతు వినిపిస్తుందో
అక్కడ సందేహాల నోరు మూతపడనీ
అన్ని మాటలూ సాధువుగా
అన్ని కలహాలూ నివారింపబడి
అన్ని బాధలూ ఏమారి
వెలుగు కళ్ళకు గుడ్డిదనాన్నీ
ప్రేమ ద్వేషాన్నీ
జ్ఞానం వినాశాన్నీ
భయం తప్పిదాలనీ తీసుకురాకుండా
ఊయలనుండి, పాడె దాకా
రక్షించు, ప్రభూ, రక్షించు !
.
మాత్యూ ఆర్నాల్డ్
(24 December 1822 – 15 April 1888)
ఇంగ్లీషు కవి

Image Courtesy: Project Gutenberg
.
Desire
.
Thou, who dost dwell alone;
Thou, who dost know thine own;
Thou, to whom all are known,
From the cradle to the grave,—
Save, O, save!
From the world’s temptations;
From tribulations;
From that fierce anguish
Wherein we languish;
From that torpor deep
Wherein we lie asleep,
Heavy as death, cold as the grave,—
Save, O, save!
When the soul, growing clearer,
Sees God no nearer;
When the soul, mounting higher,
To God comes no nigher;
But the arch-fiend Pride
Mounts at her side,
Foiling her high emprize,
Sealing her eagle eyes,
And, when she fain would soar,
Make idols to adore;
Changing the pure emotion
Of her high devotion,
To a skin-deep sense
Of her own eloquence;
Strong to deceive, strong to enslave,—
Save, O, save!
From the ingrained fashion
Of this earthly nature
That mars thy creature;
From grief, that is but passion;
From mirth, that is but feigning;
From tears, that bring no healing;
From wild and weak complaining;—
Thine old strength revealing,
Save, O, save!
From doubt, where all is double,
Where wise men are not strong;
Where comfort turns to trouble;
Where just men suffer wrong;
Where sorrow treads on joy;
Where sweet things soonest cloy;
Where faiths are built on dust;
Where love is half mistrust,
Hungry, and barren, and sharp as the sea;
O, set us free!
O, let the false dream fly
Where our sick souls do lie,
Tossing continually.
O, where thy voice doth come,
Let all doubts be dumb;
Let all words be mild;
All strife be reconciled;
All pains beguiled.
Light brings no blindness;
Love no unkindness;
Knowledge no ruin;
Fear no undoing,
From the cradle to the grave,—
Save, O, save!
.
Matthew Arnold
(24 December 1822 – 15 April 1888)
English Poet
Poem courtesy: http://www.bartleby.com/360/4/77.html
ఆఖరి ఆకు… అలెగ్జాండర్ పూష్కిన్, రష్యను కవి
నా బ్రతుకు కోరికల పరిధి దాటింది
నా వ్యామోహాలుతలుచుకుంటే విసుగేస్తోంది;
శూన్యహృదయ జనితాలైన
దుఃఖాలొక్కటే చివరకి మిగిలేది.
నా అధికార తీరాలపై
విధి రేపే క్రూరమైన తుఫానుల నీడలో
నా తుది ఘడియకోసం ఎదురుచూస్తూ
దుఃఖభరితమైన ఒంటరి బతుకు ఈడుస్తున్నాను.
ఆవిధంగా, శీతగాలి ఊళలేస్తూ
చలితో కోతపెడుతుంటే
ఆఖరిఆకు మాత్రమే మిగిలి మోడుబారిన
కొమ్మ … గజగజా వణుకుతోంది.
.
అలెగ్జాండర్ పూష్కిన్
6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837
రష్యను కవి
.

.
The Last Leaf
.
I ’ve overlived aspirings,
My fancies I disdain;
The fruit of hollow-heartedness,
Sufferings alone remain.
’Neath cruel storms of Fate
With my crown of bay,
A sad and lonely life I lead,
Waiting my latest day.
Thus, struck by latter cold
While howls the wintry wind,
Trembles upon the naked bough
The last leaf left behind.
.
Alexander Pushkin
(6 June 1799 – 10 February 1837)
Russian
Tr. From the Russian by John Pollen
Poem Courtesy: http://www.bartleby.com/360/3/110.html
పోలికలు… విలా సైబర్ట్ కేథర్, అమెరికను కవయిత్రి
(రోము నగరం లో కేపిటాల్ లో ఉన్న ఒక అజ్ఞాత వ్యక్తి అర్థాకృతి శిల్పాన్ని చూసి)
***
ప్రతి వంపులోనూ మృదుత్వం…
చింతలతో నిండిన తల ఒకింత వాలి…
సుఖాలపట్ల విముఖత, బాధ్యతలపట్ల తిరస్కారం,
అసంతృప్తితో తెరువనిరాకరించిన కనులు.
అతని ముఖంలో కనిపించే ఏహ్యభావం తప్ప
జీవితంలో అనుభవించిన సుఖదుఃఖాలగురించి
ఏ ఆచూకీ విడిచిపెట్టకుండా గతించిన ఈ యువకుని
శిల్పం ప్రక్కన కూర్చోడానికి నేను తరచు వస్తుంటాను.
ఆ ఇంటివారందరి ఆశల ప్రోవు, ఆరాధించే
సోదరుడు, బంగారంలాంటి మనసున్న కొడుకు,
అదృష్టం తల్లిలా ముద్దుచేసిన తనయుడు;
అంతే!… ఎండలో నీడగా మిగిలాడు.
యుద్ధాలలో సీజరుని అనుసరించి వెళ్ళాడో,
ఉన్న ఊరిలో వేటకి వేళ్ళి ప్రాణం పణం పెట్టాడో
లేక రోము కుటిల రాజకీయాలలో, కులట,
అదృష్టం ఎవర్ని వరిస్తుందో చూద్దామనుకున్నాడో;
లేక మెలకువలోనూ మరిచిపోలేని
ఆసియా గురించి ఏ కలలు కన్నాడో,
లేక ఏ ‘ఆస్పేసియా’*కి తన యవ్వనం ధారపోశాడో,
లేక తన పిత్రార్జితాన్నంతా జూదంలో పోగొట్టుకున్నాడో;
ఒకసారి పోగొట్తుకున్న తన మనశ్శాంతిని
తిరిగిపొందడానికి వృధాగా దేశమంతా తిరిగాడో;
చిత్రంగా, బాధతో కలగలిసిన అతని
కవళికలు సమాజాన్ని నిందిస్తున్నట్టున్నాయి.
“దైవాల పాచికలెప్పుడూ పక్షపాతంతో కూడినవే”,
ఒక క్రూరుడైన జూదరి, వాళ్ళంత అహంకారం ప్రదర్శిస్తే,
అంకుశంలాంటి క్రూరమైన తీర్పుతో పోటు పొడుస్తారు,
దానితో అతని ప్రమాదమూ, జీవితమూ అటకెక్కుతాయి.
ఏ విధమైన రాజీలకీ సిద్ధపడలేక
ఎవరినీ క్షమించనూ లేక, విడిచిపెట్టనూలేని స్థితిలో
అనుకోకుండా లభించే బహుమానాలని
అందిపుచ్చుకోగల మనోనిగ్రహం అతనికుండదు.
ఈ భౌతిక వస్తువుల మాయకు మోసపోయి…
స్థిరంగా, దృఢంగా ఉన్నట్టు కనిపించే భవనాలూ,
యుద్ధాల హాహాకారాలు, రాచరికపు ఆడంబరాలూ,
రాజ్యాధికారపు ఉచ్ఛ-, అధో-గతులూ…
అవన్నీ అతను కొల్పోయాడు, ముఖ్యంగా, ప్రతిరోజూ
అనాదిగా, బాధలకి దూరంగా ప్రయాణించే మార్గాన్ని:
మనుషులు శాశ్వతంగా మునిగి ఉండేవీ,
మనిషిగా ఉన్నంతకాలం ఉండే ఆలోచనలని పోగొట్టుకున్నాడు.
శిలావిగ్రహంలోని అజ్ఞాత వ్యక్క్తి… అవాస్తవమైన
కలలని సైతం ధిక్కరిస్తూ…
మట్టిలోకలిసిన పురాతన సామ్రాజ్యంలా…
సెలయేటిపైనే దృష్టి కేంద్రీకరించి ఉన్నాడు.
కానీ, నేను అమితంగా ఇష్టపడే, ప్రతిభావంతుడైన
నా సోదరుడు, తన జాడలను ఏమాత్రం విడిచిపెట్టనివాడు…
ఆ రెండో వ్యక్తి పాటి అదృష్టానికి కూడా నోచుకోలేదు.
కనీసం అతని విషాదం పాలరాతిలో చెక్కుచెదరకుండా ఉంది.
.
విలా సైబర్ట్ కేథర్
(7 Dec 1873 – 24 April 1947)
అమెరికను
* ఆస్పేసియా
Willa Sibert Cather
.
A Likeness
(Portrait Bust of an Unknown, Capitol, Rome)
.
In every line a supple beauty —
The restless head a little bent —
Disgust of pleasure, scorn of duty,
The unseeing eyes of discontent.
I often come to sit beside him,
This youth who passed and left no trace
Of good or ill that did betide him,
Save the disdain upon his face.
The hope of all his House, the brother
Adored, the golden-hearted son,
Whom Fortune pampered like a mother;
And then, — a shadow on the sun.
Whether he followed Cæsar’s trumpet,
Or chanced the riskier game at home
To find how favor played the strumpet
In fickle politics at Rome;
Whether he dreamed a dream in Asia
He never could forget by day,
Or gave his youth to some Aspasia,
Or gamed his heritage away;
Once lost, across the Empire’s border
This man would seek his peace in vain;
His look arraigns a social order
Somehow entrammelled with his pain.
“The dice of gods are always loaded”;
One gambler, arrogant as they,
Fierce, and by fierce injustice goaded,
Left both his hazard and the play.
Incapable of compromises,
Unable to forgive or spare,
The strange awarding of the prizes
He had not fortitude to bear.
Tricked by the forms of things material —
The solid-seeming arch and stone,
The noise of war, the pomp imperial,
The heights and depths about a throne —
He missed, among the shapes diurnal,
The old, deep-travelled road from pain,
The thoughts of men which are eternal,
In which, eternal, men remain.
Ritratto d’ignoto; defying
Things unsubstantial as a dream —
An Empire, long in ashes lying —
His face still set against the stream.
Yes, so he looked, that gifted brother
I loved, who passed and left no trace,
Not even — luckier than this other —
His sorrow in a marble face.
.
Willa Sibert Cather
(7 Dec 1873 – 24 April 1947)
American Poetess
Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2001/02/likeness-willa-sibert-cather.html
Read about Aspacia here.
Willa Sibert Cather’s work made her one of the most important American novelists of the first half of the 20th century. When Cather was nine, her family homesteaded in pioneer Nebraska. She was a tomboy at home in the saddle. enjoyed distinguished careers as journalist, editor, and fiction writer. Cather is most often thought of as a chronicler of the pioneer American West. Critics note that the themes of her work are intertwined with the universal story of the rise of civilizations in history, the drama of the immigrant in a new world, and views of personal involvements with art. Cather’s fiction is characterized by a strong sense of place, the subtle presentation of human relationships, an often unconventional narrative structure, and a style of clarity and beauty.
సంశయాత్మ … ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
ఈ పిచ్చుకలు ఎక్కడికి వలస పోయాయి?
కొంపదీసి ఏ చీకటి తుఫాను తీరాలలోనో
తడిసి వణుకుతూ మరణించలేదు గద!
ఈ పూలు ఎందుకు వాడిపోవాలి?
ఓ సంశయాత్మా!
కన్నీటి వర్షాన్ని లెక్కచేయకుండా
ఈ చలిపీఠాలలో ఎందుకు బందీలై ఉండాలి?
ఒకవంక నీ పెదాలపై చిరునవ్వు మొలిపించడానికి
శీతగాలులు వీచుతుంటే
తెల్లపిల్లిలాంటి మెత్తని మంచుక్రింద
అవి కేవలం నిద్రిస్తున్నాయి
ఇన్నాళ్ళూ సూర్యుడు
తన కిరణాల్ని దాచుకున్నాడు
ఓ నా పిరికి మనసా!
ఈ ప్రపంచాన్ని నైరాశ్యపు ఋతువు విడిచిపెట్టదా?
అంతటి ప్రకాశవంతమైన ఆకాశాన్నీ
అప్పుడే తుఫాను మేఘాలు కమ్ముకుంటున్నాయి.
త్వరలోనే, శలవుతీసుకుంటున్న వసంతం
పసిడి కాంతుల గ్రీష్మాన్ని తట్టిలేపనుంది.
నిజమైన ఆశ అణగారిపోయింది.
చీకటి వెలుగుతో దాహాన్ని తీర్చుకుంటోంది.
నిరాశానిస్పృహల నీరవాన్ని ఏ శబ్దం చేదించగలదు?
ఓ నా అనుమానపు మనసా!
ఆకాశం మేఘావృతమై ఉంది
చివరకి చుక్కలు పొడచూపక మానవు.
గతించిన చీకటిని వెలిగిస్తూ
దేవదూతల సరసభాషణని గాలి మోసుకొస్తోంది.
.
ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్
(30 October 1825 – 2 February 1864)
ఇంగ్లీషు కవయిత్రి

A Doubting Heart
.
Where are the swallows fled?
Frozen and dead
Perchance upon some bleak and stormy shore.
O doubting heart!
Far over purple seas
They wait, in sunny ease,
The balmy southern breeze
To bring them to their northern homes once more.
Why must the flowers die?
Prisoned they lie
In the cold tomb, heedless of tears or rain.
O doubting heart!
They only sleep below
The soft white ermine snow
While winter winds shall blow,
To breathe and smile upon you soon again.
The sun has hid its rays
These many days;
Will dreary hours never leave the earth?
O doubting heart!
The stormy clouds on high
Veil the same sunny sky
That soon, for spring is nigh,
Shall wake the summer into golden mirth.
Fair hope is dead, and light
Is quenched in night;
What sound can break the silence of despair?
O doubting heart!
The sky is overcast,
Yet stars shall rise at last,
Brighter for darkness past;
And angels’ silver voices stir the air.
.
Adelaide Anne Procter
(30 October 1825 – 2 February 1864)
English Poet and Philanthropist
అజరామరము … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి
చాలా విషయాలు అసలెన్నడూ జరగకపోవచ్చు;
ఇది మాత్రం తప్పక జరిగి తీరుతుంది”… ఫిలిప్ లార్కిన్
***
నా మరణం గురించిన సత్యం నాకు తెలుసు
ఈ లోకం తప్ప వేరెక్కడా నాకు పునరుజ్జీవనం లేదు.
అగ్నిలో దహించబడినా, భక్తితో సాష్టాంగపడినా
ఉన్నది ఈ శరీరం తప్ప, నాకు వేరే ఆత్మ లేదు.
నా తల్లిదండ్రులు ఈ అబద్ధాలని నాకు చెప్పారు
వాళ్ల తల్లిదండ్రులు మునుపు వాళ్ళకు చెప్పినవే.
నేను కూడా ఆ మృతుల తీరనికోరికలను
కొనసాగించడం నేర్చుకున్నాను.
జాగ్రదవస్థలోని మనసు మృత్యువుని పక్కకు నెడుతుంది
శూన్యస్థితి గూర్చిన ఆలోచన పెట్టే బాధకి భయపడి
అయినా, ఆత్మచైతన్యమన్న భావనకి వేలాడుతూ
మన ఉనికి శాశ్వతమనే పిడివాదం చేస్తుంటుంది.
మృత్యువు చాలా సరళం కావచ్చు; కానీ
వాళ్ళు దాన్ని ఒక భూతంలా చూపి, మనకి
మనగురించి స్పృహమాత్రమే ఉండదని చెబుతూ
మనకి చావే లేనట్టు, దాన్ని నిరాకరించడం నేర్పారు.
ఎన్నిచెప్పినా, “నేను” గురించి నే తెలుసుకున్నదంతా
ప్రతి నిముషమూ ముగింపుకు తీసుకువస్తూనే ఉంటుంది.
అది నిరాఘాటంగా జరిగే ప్రక్రియ కాబట్టి
మృత్యువు అజరామరము.
.
ఫిలిప్ లార్కిన్
(9 August 1922 – 2 December 1985)
ఇంగ్లీషు కవి
.
Continuity
“Most things may never happen; this one will”—Philip Larkin
.
I know the truth about my death:
I will not live beyond this place.
I have no soul apart from flesh
To writhe in flames, or kneel in grace.
My parents passed along the lies
Their parents told them way back when.
And so I learned to carry on
The wishful thinking of dead men.
Our conscious minds push back at death
Fearing that nothingness will sting,
Still clinging to self-consciousness,
Insisting we’ll be there to cling.
Death could be simple, but we’re taught
To make it monstrous by denying
That our self-consciousness will cease,
As if we’re never really dying.
And yet, each moment brings the end
Of all I’ve ever known as “me.”
But since it’s always happening,
Dying is continuity.
.
Philip Larkin
(9 August 1922 – 2 December 1985)
English Poet
Poem Courtesy: https://www.ablemuse.com/v9/poetry/jeff-holt/continuity
మడుగు…. లయొనెల్ ఆబ్రహామ్స్, దక్షిణాఫ్రికా
నే నెక్కడ లోతుగా
ఉంటానో మీరు కనిపెట్టవచ్చు
అదంతా బురదమాటు రహస్యం.
నా ఉపరితలంపై పరుచుకుంది
సువిశాలమైన నీలాకాశం
.
లయొనెల్ ఆబ్రహామ్స్
1928–2004
దక్షిణాఫ్రికా
.
Pool
Where I’m deepest
you may discern
a few muddy secrets.
My surface contains
the whole open sky.
.
Lionel Abraham
1928–2004
South African Poet
Poem Courtesy: http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/5380/10/Lionel-Abrahams
కవిత్వ పరిచయం… బిల్లీ కాలిన్స్, అమెరికను
వాళ్లని ఒక కవితని తీసుకోమని చెబుతాను.
తీసుకుని, దాన్ని ఒక రంగుటద్దాన్ని చూసినట్టు
వెలుతురుకి ఎదురుగా నిలపమని చెబుతాను.
లేకుంటే, దాని గూటికి చెవి ఒగ్గి వినమంటాను.
లేదా, కవితలోకి ఒక ఎలుకని జార్చి
అది బయటకి ఎలా వస్తుందో గమనించమంటాను.
కవిత చీకటి గదిలోకి ప్రవేశించి
దీపపు స్విచ్చి ఎక్కడుందో గోడలు తడవమని చెబుతాను.
కవిత ఉపరితలం మీద
నీటిమీద స్కీయింగ్ చేసినట్టు నడుస్తూ
ఒడ్డునున్న కవిపేరుకి చెయ్యి ఊపమని చెబుతాను.
కానీ, ఇన్ని చెప్పినా, వాళ్లు మాత్రం
కవితని కుర్చీకి తాళ్ళతో కట్టి
దానినుండి ఒక నిజాన్ని కక్కించడానికి ప్రయత్నిస్తారు.
దాన్ని ఒక గొట్టంతో కొడుతుంటారు
దాని అర్థం ఏమిటా అని తెలుసుకుందికి.
.
బిల్లీ కాలిన్స్
జననం: 22 మార్చి 1941
అమెరికను
Happy Birthday Billy Collins!
Introduction To Poetry –
.
I ask them to take a poem
And hold it up to the light
Like a color slide
or press an ear against its hive.
I say drop a mouse into a poem
And watch him probe his way out,
Or walk inside the poem’s room
And feel the walls for a light switch.
I want them to waterski
Across the surface of a poem
Waving at the author’s name on the shore.
But all they want to do
Is tie the poem to a chair with rope
And torture a confession out of it.
They begin beating it with a hose
To find out what it really means.
.
Billy Collins
(Born March 22, 1941)
American
(On the eve of World Poetry Day 21st March)
కెరటాలమీద పడవ… విలియమ్ ఎలరీ చానింగ్, అమెరికను
తెల్లని మంచు పెల్లలపై
గాలి విడిచిపెట్టిన వంకర అడుగు జాడల్లా
ఎగిసి మెలితిరిగిన కెరటం
అదాటున విరగబడినచోట అలతోపాటు వంపులు తిరుగుతూ,
మన పడవ కెరటాలపై అలవోకగా సాగుతుంది.
పద! పద! నీటిపుట్టపై నిలువెత్తు త్రోవ అదిగో!
పెనుగాలి రానుంది, తెరచాపలెత్తు…
గాలినుండే మనము ఉత్సాహం దొరికించుకోవాలి
మనసు దిటవుగా ఉంటే,
ఎంత నల్లటిమేఘమైనా తలవంచుతుంది
గాలి ఊళలకి మనం భయపడేది లేదు!
.
విలియమ్ ఎలరీ చానింగ్
(November 29, 1818 – December 23, 1901)
అమెరికను
.
“Our boat to the waves”
.
Our boat to the waves go free,
By the bending tide, where the curled wave breaks,
Like the track of the wind on the white snowflakes:
Away, away! ’T is a path o’er the sea.
Blasts may rave,—spread the sail,
For our spirits can wrest the power from the wind,
And the gray clouds yield to the sunny mind,
Fear not we the whirl of the gale.
.
William Ellery Channing
(November 29, 1818 – December 23, 1901)
American Transcendentalist poet
Poem courtesy: http://www.bartleby.com/360/5/291.html
మగాళ్ళు… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినందుకు
వాళ్ళు నిన్ను “వేగుచుక్క”వని పొగుడుతారు.
అదే సుకుమార భావనతో వాళ్ళని తిరిగి మన్నిస్తే
వాళ్ళు, నీ గురించి వేరే అర్థాలు తీస్తారు;
వాళ్లకి రూఢిగా, చింతలేని నీ పొందు దొరికిందా
వాళ్ళు నిన్ను అన్నిరకాలుగానూ మార్చడానికి ప్రయత్నిస్తారు.
నీ నడతమీద, అవేశాలమీదా ఆంక్షలు పెడతారు
వాళ్ళు నిన్ను నువ్వుకాని వేరే వ్యక్తిగా మార్చివేస్తారు.
నువ్వు నడిచేరీతిలో నిన్ను నడవనివ్వరు
వాళ్ళు తమప్రభావం చూపించి అన్నీ నేర్పుతారు.
వాళ్ళు పూర్వం పొగిడినవే, అయినా, అన్నీ మార్చెస్తారు.
ఇహ చెప్పకు! తల్చుకుంటే రోతపుడుతోంది. విసుగేస్తోంది.
.
డొరతీ పార్కర్
(August 22, 1893 – June 7, 1967)
అమెరికను కవయిత్రి
Men
.
They hail you as their morning star
Because you are the way you are.
If you return the sentiment,
They will try to make you different;
And once they have you, safe and sound,
They want to change you all around.
Your moods and ways they put curse on;
They’d make of you another person.
They cannot let you go your gait;
They influence and educate.
They’d alter all that they admired.
They make me sick. They make me tired.
.
Dorothy Parker
(August 22, 1893 – June 7, 1967)
American Poet