అనువాదలహరి

స్వర్గానికి నిచ్చెన… మారిన్ సొరెస్క్యూ, రుమేనియన్ కవి

సాలీడు అల్లిన పట్టు దారపుపోగు
కప్పునుండి వేలాడుతోంది
సరిగ్గా నా పక్కకి నెత్తిమీద.

రోజు రోజుకీ అది క్రిందకు దిగడం గమనిస్తున్నాను.
నే ననుకుంటుంటాను: “ఇప్పుడు నాకు
దేముడు స్వర్గాన్ని అధిరోహించడానికి నిచ్చెన వేస్తున్నాడని.”

నేను నీరసించిపోతే నీరసించిపోదునుగాక
పూర్వపు నా రూపుకి నేను ఒక చాయనవుతే అవుదునుగాక
కానీ, నన్నీ నిచ్చెన భరించలేదు.

ఓ హృదయమా, విను!
నువ్వు మాత్రం ముందుకి సాగు…
మెత్తగా… సుతిమెత్తగా
.
మారిన్ సొరెస్క్యూ

రుమేనియన్ కవి, నాటక కర్త

.

.

Ladder to Heaven

A silken thread, spun by a spider
Hangs from the ceiling
Just above my bed.

Day by day I watch it descend.
And think, ‘now heaven offers me ladder,
It reaches to me from above’.

Weakened though I be,
A shadow of my former self,
I think the ladder might not
Support my weight.

Listen, my soul, on you go ahead,
Softly, softly.
.

Marin Sorescu

29 February 1936 – 8 December 1996

Romanian poet and playwright

(Translation by Constantin Roman)

[In late 1996, dying of liver cancer, Sorescu dictated his last volume of poetry The Bridge to his wife, directly confronting without hesitation his own death]

Poem Couresy: http://hedgeguard.blogspot.in/2005/12/ 

చితిమీద ఒక కవి … మునిపల్లె రాజు

మునిపల్లె రాజుగారు తెలుగు కథకి చేసిన సేవ అపారమైనది. అభ్యుదయ కుటుంబనేపథ్యంనుంచి వచ్చిన రాజుగారు, రక్షణశాఖ ఉద్యోగిగా తమ రెండవ ప్రపంచసంగ్రామపు అనుభవాలనీ, బొంబాయి నూలుమిల్లుల్లో తను చూసినవీ, విన్నవీ, నవయువకుడిగా స్వాతంత్య్ర పోరాటాన్ని దగ్గరగా చూస్తూ పొందిన అనుభవమూ, ఎనభై ఏళ్ళు దాటేవరకూ చెక్కు చెదరని తన జ్ఞాపకశక్తినీ బాగా రంగరించి అపురూపమైన కథలు వ్రాసేరు. (వారు తన చిన్నప్పుడు తనతో చదువుకున్న మిత్రులూ, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లే కాదు, మిలిటరీ శిక్షణతీసుకుంటున్నప్పుడు తనకి పాఠం చెప్పిన వారి పేర్లనీ, తన అనుభవాలలో ప్రస్తావించిన ప్రతిసంఘటనలోని వ్యక్తుల్నీ పేరు పేరునా చాలాకాలం వరకూ తడుముకోకుండా చెప్పగలిగే వారు.) కస్తూరి తాంబూలం, విశాఖకనకమహాలక్ష్మి, వారాల పిల్లాడు, యశోదకొడుకు, వీరకుంకుమ, ఒక లవ్ స్టోరీ రాసిపెట్టండి సార్, దివోస్వప్నాలతో ముఖాముఖీ… ఇంకా చాలా కథల పేర్లు చెప్ప వచ్చు… వారి సునిశిత పరిశీలనాశక్తి గురించి చెప్పడానికి. అతన్ని తెలుగు సాహిత్యంలో అగ్రస్థాయి కథకుడిగా నిలబెట్టడానికి. వారు రాసిన పెద్ద కథ “పూజారి” బి. ఎన్. రెడ్డిగారి దర్శకత్వంలో పూజాఫలం సినిమాగా వచ్చింది.

రాజుగారు సహృదయుడు, మంచి మనీషి.

వారికి నివాళిగా జనవరి 25, 2012లో నా బ్లాగులో వేసిన ఈ కవితను తిరిగి పోస్టుచేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలుగు గాక!

.

చర్చిగంటలు మ్రోగడం లేదు.
బజార్లు రద్దీగానే ఉన్నాయి
ఆఫీసులు మూతపడలేదు
సంతాప దినాలు ప్రకటింపబడలేదు
వాహన సంచారం యధాప్రకారం అస్తవ్యస్తంగానే ఉంది
సినిమాహాళ్ళు ఎప్పటిలాగే కిక్కిరిసి ఉన్నాయి

*

శవయాత్ర సాగుతోంది… అయితే
ముందు బేండు మేళాలు మోగటమూ లేదు
వెనుక గుర్రపు సవారీలు అనుసరించడమూ లేదు.
పాడె మీద కవి ఏం పట్టనట్టు పరున్నాడు
శవవాహకులు నలుగురూ పిడికిళ్లు బిగించి నడుస్తున్నారు.

*

జండాలు అవనతం కాలేదు.

కొందరు ఇరుగు పొరుగు వాళ్ళూ,
తోటి కవులు మరికొందరూకనిపిస్తున్నారు.

అతని ప్రచురణ కర్తలు కనపడటం లేదు
ఫొటోగ్రాఫరు జాడలేదు
కాకపోతే ఒకరిద్దరు విమర్శకులూ
బాధ్యత మరువని ఓ విలేఖరీ వెంటనడుస్తున్నారు.

శ్మశానంలో పాడె క్రిందకి దింపారు
మృతునిగురించి ప్రసంగం చెయ్యవలసి ఉంది
వక్తకి కళ్ళు చెమరుస్తున్నాయి
అతని మాటలు శాంతగంభీరంగా ఉన్నాయి.

కాని, కాల్చడానికి కట్టెలూ,
వెలిగించడానికి ఇంధనం ఏవీ?
కవి ఆత్మకి శాంతి కూర్చేదెలా?

కొన్ని నిముషాలు దొర్లిపోయాయి
చందాలు వసూలు చెయ్యడానికి టోపీ కలదిరిగింది
కానీ, అందులో చేరుకున్న నాణేలు కొన్నే.

*

ఆరె! ఎవరది ఓ డొక్కు రిక్షాలోంచి
శ్మశానద్వారం దగ్గర దిగుతున్నది?

అతని వితంతువు అతని వ్రాతప్రతులన్నీ
కట్టగట్టి తీసుకు వచ్చింది.

ఇక మనం చితిముట్టిద్దాం రండి
మరి ఎంతమాత్రం ఆలస్యం చెయ్యలేం!

*

Original:

Poet On The Funeral Pyre

.

No bells are tolling.

The  bazars are throbbing

Offices not closed

No mourning declared

Traffic as usual chaotic

Cinemas are crowded systematic

*

A funeral procession passes by

Sans brass bands leading

Sans any cavalcade following

On the bier a poet unconcerned rests

Pall bearers four grim like fists.

*

I see flags on fullmast

His humble neighbours few

And fellow poets some

You spot no lensme

His publishers are unseen

But a gentle critic or two

And a duty bound reporter too.

The bier is grounded

A funeral oration to sound

But the speakers eyes are moist

His words are deeply silent

Where is the fuel where is the firewood

To lit the pyre to put him to rest.

A few moments roll

A hat is passed on to fill

But the coins offered are few.

*

Lo, a rickety rickshaw at the entrance sighted

A widow alights with all his manuscripts piled and bundled

Now let us lit the pyre

We can’t wait any more!

*

Munipalle Raju

%d bloggers like this: