భవిష్యవాణి …ఆర్థర్ డేవిసన్ ఫికే, అమెరికను కవి
ఒక వేసవి సాయంవేళ పచ్చికమీద మేను వాల్చేను.
పసిడిచాయల జుత్తుగల అందమైన పాప అటుగా వచ్చి,
నన్నొకసారి పరికించి, దాటిపోడానికి ఇష్టంలేక
వదలని సందేహాలు కళ్ళలో తొంగిచూస్తుండగా
నిలబడి, సంకోచిస్తూనే నా ముందుకు వచ్చి
(ఓహ్! ఆమె తలచుట్టూ ఎంత లేత బంగరు పరివేషమో!)
నా భుజం మీదనుండి తొంగిచూస్తూ అడిగింది:
“మీరు చదువుతున్నదేమిటి?” అని.
“నే నొక ప్రాచీన కవి కవిత్వం చదువుతున్నాను,
తన జీవితకాలమంతా అతను తన కవిత్వంకంటే
అందమైన ఈ పుడమి సౌందర్యాన్నీ
ఈ సెలయేళ్ళనీ, పువ్వుల్నీ, నక్షత్రాల్నీ గానంచేసేడు.
“నేనిపుడు అతన్నెందుకు చదువుతున్నానంటే
ఇంతసుందరమైన విషయాలని మనుషులు మరిచిపోతారుగనుక;
అతనికీ నాకూ పొర్లి ప్రవహించే వాగులన్నా
అరుణోదయాలన్నా, తేనెటీగలూ, రెక్కల రెపరెపలన్నా ఇష్టం. “
కళ్లలో నవ్వుతో, ఆమె నావంక చూసి,
నా మోకాళ్ళపై తనచేతులుంచి ఇలా అంది:
“ఇవన్నీ పుస్తకాల్లో చదవడం చిత్రంగా ఉంది.
నన్నడిగితే ఇవన్నీ చెప్పేదాన్ని గదా!”
.
ఆర్థర్ డేవిసన్ ఫికే
(10 Nov 1883 – 30 Nov 1945)
అమెరికను కవి, నాటకకర్త.
.
.
The Oracle
.
I lay upon the summer grass.
A gold-haired, sunny child came by,
And looked at me, as loath to pass,
With questions in her lingering eye.
She stopped and wavered, then drew near,
(Ah!the pale gold around her head!)
And over my shoulder stopped to peer.
“Why do you read/” she asked.
“I read a poet of old-time,
Who sang through all his living hours –
Beauty of earth, the streams, the flowers –
And stars, more lovely than his rhyme.
“And now I read him, since men go,
Forgetful of these sweetest things;
Since he and I love brooks that flow,
And dawns, and bees, and flash of Wings!”
She stared at me with a laughing look,
Then clasped her hands upon my knees:
‘How strange to read it in a book!
I could have told you all of these!”
.
Arthur Davison Ficke
(November 10, 1883 – November 30, 1945)
American poet, Playwright and expert of Japanese art.
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి