ధూళి… డొరతీ ఏండర్సన్

ధూళి అంటే ఏమిటి?
భస్మమైన ప్రేమ, రంగువెలిసిన ఉత్తరాలు, వాడిపోయిన పువ్వులు,
జీవంలేని చేతిలోంచి రాలిపడ్డ గులాబిరేకులు
సాలీళ్ళూ, గబ్బిలాలూ, పాడుబడిన ఇళ్ళూ, కూలుతున్న దుర్గాలూ,
కాలగర్భంలో కలిసిపోయిన వీరసైనికుల రథచక్రాల జాడలు.

అంతేనా?
ఓహ్! ధూళంటే వెలుగూ, కేరింతలూ
సర్కస్సులూ, విలాసమైన గొడుగులూ, ఒళ్ళుచక్కదిద్దుకుంటున్న పావురాలూ
రాదారి దాపునే విహరిస్తున్న ప్రేమజంటలూ
ఎండలో రోడ్డుమీద తడబడుతూ నడిచే చిరుగుపాతల తాగుబోతులూ.
ధూళంటే సుమధురమైన పొదరిళ్ళలో చిక్కిన రంగుల ఇంద్రధనుసు వలలు.
ఈ ధూళే, నక్షత్రాల మిరిమిట్లు నన్ను గుడ్డిదాన్ని చెయ్యకుండా రక్షిస్తున్నది.

.

డొరతీ ఏండర్సన్

Dust

 What is dust?     

Ashes of love, charred letters, faded heliotrope, 

Rose petals fallen from a dead hand,

Spiders, bats, deserted houses, crumbling citadels,      

And wheel ruts where vanished armies have passed.          

Is that all?  

Oh, dust is sun and laughter,  

Circuses, parasols, preening pigeons,        

Lovers picnicking by the roadside,  

And ragamuffins tumbling in the warm lanes.            

Dust is rainbow webs caught in sweet, hot smelling hedges,  

And it is dust that keeps my eyes from being blinded by the stars!

.

Dorothy Anderson

Poem Courtesy:

Contemporary Verse, November 1919

http://www.bartleby.com/273/98.html

From:

Anthology of Magazine Verse for 1920.   

Ed: William Stanley Braithwaite,  (1878–1962).  

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: