కొందరు మగాళ్ళు, ఒక పుస్తకాల షాపుని దాటి పోలేరు. (ఓ ఇల్లాలా, మనసు రాయి చేసుకో, జీవితకాలం నిరీక్షించు)
కొందరు మగాళ్ళు చెత్త ఆటలు ఆడకుండా ఉండలేరు. (“ఏదీ చీకటిపడే వేళకు రానూ?” అన్నాడు, అప్పుడే సూర్యోదయం కావస్తోంది)
కొందరు మగాళ్ళు పానశాలను దాటి రాలేరు. (నిరీక్షించు, ఎదురుచూడు… చివరకు అదేమిగులుతుంది)
కొందరు మగాళ్ళు అందమైన స్త్రీని దాటి పోలేరు. (భగవంతుడా! అలాంటి వాళ్ళని నాదగ్గరకు పంపకు)
కొందరు మగాళ్ళు గాల్ఫ్ మైదానం దాటి రాలేరు. (పుస్తకం చదువు, కుట్టు కుట్టుకో… వస్తే ఒక కునుకు తియ్యి)
కొందరు మగాళ్ళు బట్టలకొట్టు దాటి రాలేరు. (నీ జీవితమంతా ఎవరో ఒక మగాడికోసం ఎదురుచూడ్డంతో సరిపోతుంది) . డొరతీ పార్కర్ 22 August 1893 – 6 June 1967 అమెరికను కవయిత్రి
స్పందించండి