కల… ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నా రోదనకి విలువ లేదు నువ్వు నవ్వితే, నేను పట్టించుకోను. అలా ఆలోచించడం నా తెలివితక్కువలా కనిపించవచ్చు కానీ, నువ్వక్కడ ఉన్నావన్న భావన ఎంతో బాగుంటుంది.
ప్రియతమా! నిద్రలో నేను మేలుకున్నట్టు కలగన్నాను… భయపెట్టే,తెల్లని వెన్నెల అలా నేలమీద పాకురుతూ వచ్చింది…ఎక్కడో, ఏ మూలనో కిటికీ ఓరగా ఉంది… అది కిర్రు మంది.
చిత్రం! గాలికి కొట్టుకుందేమో అనుకుందికి గాలే లేదు! నాకు చాలా భయమేసింది. నీకోసం చూశాను. నీ అనునయంకోసం చెయ్యి చాచేను… కానీ నువ్వెళ్ళిపోయావు. చల్లగా, మంచుముద్దలా
నా చేతికింద వెన్నెల తగులుతోంది. ప్రియా! నువ్వు నవ్వినా నేను పట్టించుకోను. నే నిపుడు ఏడ్చినా ప్రయోజనం లేదు. కానీ, నువ్వక్కడ ఉన్నావన్న భావన ఎంతో బాగుంటుంది. .