స్వీట్ ఛారియట్ అంత్యక్రియల సంఘం ప్రకటన… మెరిలీన్ టేలర్, అమెరికను

[ముందుగా ఊహించినట్టు సమాధులలో ఖాళీజాగా కొరత కారణంగా ఒక సరికొత్త సేవ అందుబాటులోకి తీసుకువచ్చాము. ఇందులోని ప్రత్యేకత వ్యక్తుల భౌతిక అవశేషాలను జాగ్రత్తగా ఒక అంతరిక్ష నాళికలో ప్రోదిచేసి, భద్రపరచి చివరకు భూకక్ష్యలో శాశ్వతంగా ఉండేటట్టు ప్రవేశపెట్టడం…. డిస్కవర్ మేగజీన్ ]

***

మిత్రమా!
మేము మా సామర్థ్యాన్ని
మించి పనిచేస్తున్నాం.
ఇక మేము మీ సమాధికై
పచ్చని పచ్చిక స్థలాన్ని
కేటాయించలేము.
ఖాళీ జాగా అలభ్యం. 

మా ఖాతాదారులకు వినతి: బదులుగా,
మీరు మీ చితా భస్మాన్ని
మాదగ్గర భద్రపరచే అవకాశం ఇస్తున్నాం
ఈ ఆధునిక అంతరిక్షయుగ ‘ఉత్తరక్రియల నిర్వాహకులు’
దానిని తుప్పుపట్టని ఉక్కు గొట్టాల్లో భద్రపరుస్తారు
(న్యూటను తదనంతర ఖగోళ విజ్ఞాన ఫలితం)

ఆ పైన మీరూ
(మీతో పాటు మీ ఆత్మీయులందరూ కూడా)
ప్రత్యేకంగా ఎర్పాటుచేసిన వ్యోమనౌకను
అధిరోహించి
స్వర్గానికి అతిసమీపంలో
చిరస్థాయిగా ఉండవచ్చు.
.

మెరిలీన్ టేలర్
జననం అక్టోబరు 2, 1939
అమెరికను.

.

.

Notice from the Sweet Chariot Funeral Parlor

.

(Due to predicted overcrowding in or cemeteries, a new service is available which will see to packing and storing one’s remains in a space capsule for eventual launching into Earth’s orbit.

 —Discover Magazine)

Dear Friend: we

     are operating at capacity

and cannot

     supply a green and grassy spot

for your tomb,

     as there is no more room.

Instead, you are invited to entrust

     your dust

to our space-age morticians, who seal

     in stainless steel

(thanks to post-Newtonian science)

     our clients.

Whereupon you

     (and all your shiny loved ones, too)

shall ascend

     via chartered rocketship, to spend

eternity

     very near where Heaven used to be.

    .

Marilyn L. Taylor

Born 2 October   1939

American

 

Poem Courtesy:

http://www.poemtree.com/poems/NoticeFromTheSweetChariot.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: