మనిషికి యంత్రాల నివాళి… ఎలీషియా స్టాలింగ్స్, అమెరికను కవయిత్రి ఆ మొరటుచేతుల వెచ్చదనాన్నిపుడు కోల్పోయాం, వాళ్ళ వేళ్లకంటుకున్న చముర్లూ, దులపడానికి ప్రయత్నించినపుడు రేగొట్టిన దుమ్మూ, మనల్ని నిందిస్తూ తిట్టే బండబూతులూ లేవిపుడు. మనం చెడిపోయినపుడు కుక్కల్ని తన్నినట్లు కాళ్ళతో తన్నేవాళ్ళు, అయినా మనం ఎన్నడూ మూలగలేదు. పళ్ళు బిగించి ఓర్చుకున్నాం. అటువంటు వాడి వేడి తిట్లు తినడం, మనల్ని కుక్కల్లా చూడడమే ఒక పెద్ద సమ్మానంగా భావించుకున్నాం. మనం అర్థాంతరంగా ఆగినపుడు వాళ్లు మనల్ని బ్రతిమాలుతూ, ఇష్టంలేని ప్రియురాలిని ప్రార్థించినట్టు గొంతుక బొంగురుపోయేలా “రా! ఈ ఒక్కసారికీ ఎలాగైనా పనిచెయ్,” అని అభ్యర్థించిన తీరూ, వాళ్ళు మాటాడినప్పుడు వెలువడిన ఊపిరుల నులివెచ్చదనం ఎంతబాగుండేవని! వాళ్లు ఇంతలోనే అదృశ్యమైపోతారని ఎవరు కలగన్నారు? మనకిప్పుడూ అన్ని పనులూ బంద్; ఎంత బాగుండెదని మన పని, ఏ పనీ చెయ్యకుండా,, ఏ తిరుగుళ్ళూ లేకుండ పువ్వుల్లా వాడిపోవడం కాదు, సిగ్గుమాలిన డాండిలియన్లలా పచ్చికనిండా తెగబలియడమూ కాదు. ఇప్పుడు గాలి నిశ్శబ్దంగా వీస్తోంది పొగడ్తలూ తెగడ్తలూ లేక మోసగించబడి, నరకంలాంటి ఈ వాతావరణం పాలబడి, శాశ్వతంగా మన ఖర్మానికి మనం విడిచిపెట్టబడి అవసానదశలో ఎణ్డకి ఎండి తుప్పుపట్టిపోతాము. . ఎలీషియా స్టాలింగ్స్ జననం 2 జులై 1969 అమెరికను కవయిత్రి . The Machines Mourn the Passing of People . We miss the warmth of their clumsy hands, The oil of their fingers, the cleansing of use That warded off dust, and the warm abuse Lavished upon us as reprimands. We were kicked like dogs when we were broken, But we did not whimper. We gritted our cogs— An honor it was to be treated as dogs, To incur such warm words roughly spoken, The way that they pleaded with us if we balked— “Come on, come on” in a hoarse whisper As they would urge a reluctant lover— The feel of their warm breath when they talked! How could we guess they would ever be gone? We are shorn now of tasks, and the lovely work— Not toiling, not spinning—like lilies that shirk— Like the brash dandelions that savage the lawn. The air now is silent of curses or praise. Jilted, abandoned to hells of what weather, Left to our own devices forever, We watch the sun rust at the end of its days. . Alicia E. Stallings Born 2 July 1969 American http://www.poemtree.com/poems/MachinesMourn.htm Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే అక్టోబర్ 17, 2017
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు#2026Alicia E. StallingsAmericanBorn 2 July 1969Woman అదృశ్య నేత్రం …జాన్ ష్రైబర్, అమెరికను కవిచిన్న ఓడ … ఏలన్ సల్లివాన్, అమెరికను స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.