మరుపు… కెరొలీన్ రఫేల్, అమెరికను కవయిత్రి

ప్రారంభంలో తేడా చాలా చిన్నగా ఉండేది… తాళం ఎక్కడో పెట్టేయడమో,
ఎంతో స్నేహపూర్వకంగా ఉండి, వాళ్లని పలకరించాలనుకున్నప్పుడు
కొత్తగా పక్కింట్లో చేరినవాళ్ల పేరు మరిచిపోవడమో;
బాగా తెలిసిన ప్రదేశమే, తెల్లారేసరికల్లా
ఎవరో మాయచేసినట్టు బొత్తిగా కొత్తప్రదేశమైపోయేది…
“ఫ్రాన్స్ లో చాలా పేరుపడ్ద గొప్ప కెఫే ఉంది (లేక గ్రీసులోనా?)
మనం కోరింత్ లో కదూ కబుర్లుచెప్పుకుంటూ మద్యం సేవించింది (లేక నైస్ లోనా?)..”
“అప్పుడే మరిచిపోయావా? అది నార్మండీ.”
అలా ఇద్దరం ఒకరి పొరపాట్లు ఒకరు క్షమించేసుకుంటాం
జ్ఞాపకాలూ కలగా పులగమై, ఒక ప్రముఖుని పద్యాన్ని
మరొకరికి అంటగట్టి ఒక్కోసారి కోపం తెచ్చుకుంటూండడమూ,
ఒకరినొకరు ఎకసెక్కాలాడుకుంటూ ఆనందించడమూ జరుగుతూంటుంది.
చివరకి ఒకసారి స్టాంపు కోసం వెతుకుతుంటే ఉత్సాహాన్ని నీరుగారుస్తూ
ఎప్పుడో పోస్టుచెయ్యకుండా ఉంచేసిన ఉత్తరం పర్సులో కనిపిస్తుంది.
.
కెరొలీన్ రఫేల్

అమెరికను కవయిత్రి

.

Forgetting

At first the gaps are small:  a mislaid key,

The name of the new neighbor, whose friendly face

Invites address; then some familiar place,

Its landscape changed by twilight’s sorcery

Into an alien facsimile.

“That sweet café in France (or was it Greece?)

Where we sipped wine from Corinth (maybe Nice) . . . .”

“Don’t you remember?  It was Normandy.”

So we both tolerate each other’s slips,

Indulge the mangled punch line and the flare

Of irritation at misquoted verse,

Amuse ourselves with calculated quips—

Till I look for a stamp, and, in despair,

I find an unmailed letter in my purse.

.

Carolyn Raphael

American

6 Longview Place

Great Neck, NY 11021

craphael429@gmail.com

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Forgetting.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: