రోజు: అక్టోబర్ 15, 2017
-
మరుపు… కెరొలీన్ రఫేల్, అమెరికను కవయిత్రి
ప్రారంభంలో తేడా చాలా చిన్నగా ఉండేది… తాళం ఎక్కడో పెట్టేయడమో, ఎంతో స్నేహపూర్వకంగా ఉండి, వాళ్లని పలకరించాలనుకున్నప్పుడు కొత్తగా పక్కింట్లో చేరినవాళ్ల పేరు మరిచిపోవడమో; బాగా తెలిసిన ప్రదేశమే, తెల్లారేసరికల్లా ఎవరో మాయచేసినట్టు బొత్తిగా కొత్తప్రదేశమైపోయేది… “ఫ్రాన్స్ లో చాలా పేరుపడ్ద గొప్ప కెఫే ఉంది (లేక గ్రీసులోనా?) మనం కోరింత్ లో కదూ కబుర్లుచెప్పుకుంటూ మద్యం సేవించింది (లేక నైస్ లోనా?)..” “అప్పుడే మరిచిపోయావా? అది నార్మండీ.” అలా ఇద్దరం ఒకరి పొరపాట్లు ఒకరు క్షమించేసుకుంటాం…