అనువాదలహరి

గీగీస్ అంటే గుర్రాలు… రిచర్డ్ మూర్, అమెరికను కవి

అప్పుడే కొత్తగా మాటలు పలకడం వస్తున్న చిన్న పిల్లల మానసిక స్థితిమీద రాసిన ఒక చక్కని కవిత

.

గీగీస్ అంటే గుఱ్ఱాలు; నల్లగా కనిపించే మలానికి
ఆమెవాడే మాట తా-తా. ఒకసారి పొదల్లోని గడ్డీ గాదంగుండా
తప్పటడుగులు వేసుకుంటూ, ఎండిపోయిన తోలులా ఉన్న
ఒక పెద్ద గుఱ్ఱపు పెంటకుప్పని చూశాము;
దీ? (అదేమిటీ?) అని అడిగింది. అప్పటివరకు ఆమె నోట
మేము అర్థంలేని మాటలేవిన్నాము; ఒక్కసారి నాకు జ్ఞానోదయమై
ఆమె అంటున్న మాటలని వరసగా పేర్చడానికి ప్రయత్నించాను
కనీసం ఒకసారైనా దాని ఫలితం ఎలా ఉంటుందో సాహసించలేదు:
మా పాప అక్కడ నిలబడింది, నిశ్శబ్దంగా, కళ్ళు విప్పార్చి, ఏమిటా అని చూస్తూ,
ఆమెకి నేనేదో మెరుస్తున్న నాణెం ఇచ్చినట్టు సంబరపడిపోతూ
గీగీ… తాతా గీగీ…తాతా … అంటూ చప్పట్లుకొడుతూ అరుస్తోంది.
ఆమెని ఆవరించి ఉన్న ఒక పెద్ద బలమైన పొర పగిలిపోయినట్టు
ఆమె ఎంతలా కేరింతలుకొట్టిందంటే అన్ని కొండలూ బదులుపలికేయి
మా చుట్టూ పరుచుకున్న ఈ చీకటికొండలన్నీ ప్రతిధ్వనించేయి.
.

రిచర్డ్ మూర్

(February 26, 1920 – March 25, 2015)

అమెరికను కవి

.

.

Gee-Gees Were Horses …

Gee-gees were horses, ta-ta her first word

for her dark faeces, when through hay and heather

toddling, we stopped to see, as dry as leather,

a heap of lumps, a hummock of horse turd;

and, Da? she questioned, who had only heard

meaningless names till then—when like a feather

a thought struck and I put her words together,

not once daring to hope for what occurred:

she stood there, silent, puzzled, open-eyed,

as if I’d handed her some shiny token,

then, Gee-gee ta-ta . . . gee-gee ta-ta! cried,

as if a shell surrounding her had broken,

and shouted still, till all the hills replied—

till the dark hills surrounding us had spoken.

Richard Moore

(February 26, 1920 – March 25, 2015)

American Poet

http://www.poemtree.com/poems/GeeGeesWereHorses.htm

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: