(రషేల్ హాదాస్ కి )
పాత గాయాలు లోతైన శూన్యాన్ని విడిచిపెడతాయి.
వాటిగురించి తరచు ఆలోచించేవాళ్ళు
ఎన్ని కష్టాలొచ్చినా ఏ మాత్రం చెక్కుచెదరని
ఒకప్పటి తమ శక్తి సామర్థ్యాలూ,
అందచందాల జ్ఞాపకాలలో ఓలలాడవచ్చు-
నా గాయాల మచ్చలే నన్ను ఆరోగ్యంగా ఉంచాయి.
కారణం, ఇప్పుడు నన్ను ఏది గాయపరచినా
అది ఇంతకు ముందు ఏర్పడిన గాయానికి పొడిగింపే;
అది నాకు ఏ కష్టమూ కలిగించకుండా నన్ను నా
ఆలోచనల అంతరాళంలోకి తీసుకుపోతుంది.
.
సామ్యూల్ మినాష్
(September 16, 1925 – August 22, 2011)
అమెరికను కవి
Cargo
(For Rachel Hadas)
.
Old wounds leave good hollows
Where one who goes can hold
Himself in ghostly embraces
Of former powers and graces
Whose domain no strife mars—
I am made whole by my scars
For whatever now displaces
Follows all that once was
And without loss stows
Me into my own spaces
.
Samuel Menashe
(September 16, 1925 – August 22, 2011)
American
http://www.poemtree.com/poems/Cargo.htm
స్పందించండి