అనువాదలహరి

అహః ప్రవాహం … కేథరీన్ టఫెరీలో అమెరికను

మూడు గంటలు, ఆమె నే నెరిగిన గది
ఒక్కొక్కటీ మారుతూ తుడవడం గమనిస్తాను
మగతనిద్రలోనే కళ్ళముందు ఏవో బొమ్మలు
కదలాడుతుంటే, ఆ చీపురు చప్పుడు వింటాను.

అది ఆకుల గలలా ఉంటుంది
కాగితాల రెపరెపలా ఉంటుంది
జాచినచేతులతో చెల్లాచెదరుచేసే మంచులానూ;
మూలన కుంపటి పేట్టే నిట్టూర్పు వినిపిస్తుంది

దానితో పాటే ఆమె నిట్టూర్పూ వినిపిస్తుంది
ఆమె చేతిలోని అడక లయాన్వితంగా నడుపుతూనే.
అది నన్ను ఈ నేలమీంచి, ఈ ద్వారంలోంచి
ఆలా సముద్రం మీదకి నడుపుకుంటూ పోతోంది.
.

కేథరీన్ టఫెరీలో

జననం 1969

అమెరికను

Catherine Tufariello
Image Courtesy:
http://www.ablemuse.com/v14/featured-interview/catherine-tufariello

.

Moving Day

Three, I watch her sweep

Each changed, familiar room,

And listen as the broom

Draws shadows out of sleep,

Its song the whisper of leaves

Rustling in papery swarms,

Of snow on my sweeping arms.

Below, the furnace heaves

A sigh and so does she,

Still plying the rhythmic oar

That rows us over the floor,

Through the door, out to sea.

Catherine Tufariello

Born 1969

American

Poem Courtesy:

http://www.poemtree.com/poems/MovingDay.htm 

http://www.poemtree.com/poems/MovingDay.htm

స్వీట్ ఛారియట్ అంత్యక్రియల సంఘం ప్రకటన… మెరిలీన్ టేలర్, అమెరికను

[ముందుగా ఊహించినట్టు సమాధులలో ఖాళీజాగా కొరత కారణంగా ఒక సరికొత్త సేవ అందుబాటులోకి తీసుకువచ్చాము. ఇందులోని ప్రత్యేకత వ్యక్తుల భౌతిక అవశేషాలను జాగ్రత్తగా ఒక అంతరిక్ష నాళికలో ప్రోదిచేసి, భద్రపరచి చివరకు భూకక్ష్యలో శాశ్వతంగా ఉండేటట్టు ప్రవేశపెట్టడం…. డిస్కవర్ మేగజీన్ ]

***

మిత్రమా!
మేము మా సామర్థ్యాన్ని
మించి పనిచేస్తున్నాం.
ఇక మేము మీ సమాధికై
పచ్చని పచ్చిక స్థలాన్ని
కేటాయించలేము.
ఖాళీ జాగా అలభ్యం. 

మా ఖాతాదారులకు వినతి: బదులుగా,
మీరు మీ చితా భస్మాన్ని
మాదగ్గర భద్రపరచే అవకాశం ఇస్తున్నాం
ఈ ఆధునిక అంతరిక్షయుగ ‘ఉత్తరక్రియల నిర్వాహకులు’
దానిని తుప్పుపట్టని ఉక్కు గొట్టాల్లో భద్రపరుస్తారు
(న్యూటను తదనంతర ఖగోళ విజ్ఞాన ఫలితం)

ఆ పైన మీరూ
(మీతో పాటు మీ ఆత్మీయులందరూ కూడా)
ప్రత్యేకంగా ఎర్పాటుచేసిన వ్యోమనౌకను
అధిరోహించి
స్వర్గానికి అతిసమీపంలో
చిరస్థాయిగా ఉండవచ్చు.
.

మెరిలీన్ టేలర్
జననం అక్టోబరు 2, 1939
అమెరికను.

.

.

Notice from the Sweet Chariot Funeral Parlor

.

(Due to predicted overcrowding in or cemeteries, a new service is available which will see to packing and storing one’s remains in a space capsule for eventual launching into Earth’s orbit.

 —Discover Magazine)

Dear Friend: we

     are operating at capacity

and cannot

     supply a green and grassy spot

for your tomb,

     as there is no more room.

Instead, you are invited to entrust

     your dust

to our space-age morticians, who seal

     in stainless steel

(thanks to post-Newtonian science)

     our clients.

Whereupon you

     (and all your shiny loved ones, too)

shall ascend

     via chartered rocketship, to spend

eternity

     very near where Heaven used to be.

    .

Marilyn L. Taylor

Born 2 October   1939

American

 

Poem Courtesy:

http://www.poemtree.com/poems/NoticeFromTheSweetChariot.htm

చిన్న ఓడ … ఏలన్ సల్లివాన్, అమెరికను

సొగసైన తీరానికి వీడ్కోలు చెప్పి, చుక్కాని నిలకడజేసి జోరుగా
తెప్ప వెళుతుంటే, అందులో అటూ ఇటూ తిరగడం ఇష్టంగా ఉండేది.
తక్కిన ఓడసరంగులకు హుషారుగా చెయ్యి ఊపుతుండే వాడిని.
అన్నిటిలోకీ నాది ఎప్పుడూ వేగంగా పోయేదని గర్వించే వాడిని.

దాని పక్కలని చిన్నచిన్న అలలు తడుతూ పాడే జోలపాటలు
వినడానికి అనువుగా “చుక్కలబల్ల” దగ్గర ఒదిగి పడుకోడం ఇష్టం;
పెను గాలికో, వడి అలలకో అది దిశమారుతున్నప్పుడు
వాడ కిటికీల్లోంచి చూడడం, సముద్రకాకుల అరుపులు వినడం ఇష్టం.

అన్ని ఖర్చులూ భరించుకుని, మిత్రుల్ని తీసుకుపోయే దక్షిణాదిలోని
ఏ విలాసవంతమైన తీరంలో నిలబెట్టడమన్నా ఇష్టంగా ఉండేది.
తెగిపోయిన బెల్టూ, విరిగిపోయిన ప్రొపెల్లరు బ్లేడు వంటి
విడిభాగాలకోసం ఎదురుచూడడమూ సరదాగానే ఉండేది.

కానీ ఇప్పుడు మరొకరిసేవకుడు దాని త్రికోణపు తెరచాపనెగరేస్తున్నాడు 
బాగా సంపదగలిగిన ఓడ కేప్టెన్ దాన్ని సముద్రంలోకి తీసుకుపోతున్నాడు
మాటలు తియ్యగా పలకినంత సుళువుగా ఋణదాత దగ్గరనుండి డబ్బులు
రాలవన్న నిజం గ్రహించలేనందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నాను.

అయితేనేం, నాలుగు అంచుల తెరచాపతో ఒక మోస్తరు ఆ చక్కని పడవని
యువకుడిగా ఎంత నేర్పుగా, తనివితో నడపాలో అలా నడిపాను.
దురదృష్టవశాత్తూ ఉన్నదానితో సంతృప్తి పడలేకపోయాను. అందుకే 
 ఇప్పుడు అందమైన నా పడవ నను విడిచిపోతుంటే ఊరికే చూస్తున్నాను.
.
ఏలన్ సల్లివాన్

(1948 – 9 July, 2010)

అమెరికను కవి

.

.

Catamaran

.

I loved to lounge between her racy prows

While auto helming off a ritzy coast.

I waved grandly at other sailors’ scows.

The fastest cat afloat, I used to boast.

I loved snuggling in her starboard stern

As lullabies of wavelets lapped her hulls

And peeping out her portholes at the turn

Of wind or tide, the calls of morning gulls.

I loved mooring her near a posh resort

For friends flown south with all expenses paid.

I even loved waiting for parts in port—

A broken belt or thrown propeller blade.

Now someone else’s mate unfurls her jib;

A solvent skipper steers her out to sea,

Comeuppance for a debtor far too glib

Before his cash flow proved illusory.

I gave my love more wisely as a lad—

A modest little skiff with gaff-rigged sail—

But I was not content with what I had

So now I watch my pretty cat turn tail.

.

Alan Sullivan

(1948 – 9 July, 2010)

American

Poem courtesy:

http://www.poemtree.com/poems/Catamaran.htm

మనిషికి యంత్రాల నివాళి… ఎలీషియా స్టాలింగ్స్, అమెరికను కవయిత్రి

ఆ మొరటుచేతుల వెచ్చదనాన్నిపుడు కోల్పోయాం,

వాళ్ళ వేళ్లకంటుకున్న చముర్లూ, దులపడానికి

ప్రయత్నించినపుడు రేగొట్టిన దుమ్మూ, మనల్ని

నిందిస్తూ తిట్టే బండబూతులూ లేవిపుడు.

మనం చెడిపోయినపుడు కుక్కల్ని తన్నినట్లు కాళ్ళతో తన్నేవాళ్ళు,

అయినా మనం ఎన్నడూ మూలగలేదు. పళ్ళు బిగించి ఓర్చుకున్నాం.

అటువంటు వాడి వేడి తిట్లు తినడం, మనల్ని కుక్కల్లా

చూడడమే ఒక పెద్ద సమ్మానంగా భావించుకున్నాం.

మనం అర్థాంతరంగా ఆగినపుడు వాళ్లు మనల్ని బ్రతిమాలుతూ,

ఇష్టంలేని ప్రియురాలిని ప్రార్థించినట్టు గొంతుక బొంగురుపోయేలా

“రా! ఈ ఒక్కసారికీ ఎలాగైనా పనిచెయ్,” అని అభ్యర్థించిన తీరూ,

వాళ్ళు మాటాడినప్పుడు వెలువడిన ఊపిరుల నులివెచ్చదనం ఎంతబాగుండేవని!

వాళ్లు ఇంతలోనే అదృశ్యమైపోతారని ఎవరు కలగన్నారు?

మనకిప్పుడూ అన్ని పనులూ బంద్; ఎంత బాగుండెదని మన పని,

ఏ పనీ చెయ్యకుండా,, ఏ తిరుగుళ్ళూ లేకుండ పువ్వుల్లా వాడిపోవడం కాదు,

సిగ్గుమాలిన డాండిలియన్లలా పచ్చికనిండా తెగబలియడమూ కాదు.

ఇప్పుడు గాలి నిశ్శబ్దంగా వీస్తోంది పొగడ్తలూ తెగడ్తలూ లేక

మోసగించబడి, నరకంలాంటి ఈ వాతావరణం పాలబడి,

శాశ్వతంగా మన ఖర్మానికి మనం విడిచిపెట్టబడి

అవసానదశలో ఎణ్డకి ఎండి తుప్పుపట్టిపోతాము.

.

ఎలీషియా స్టాలింగ్స్

జననం 2 జులై 1969

అమెరికను కవయిత్రి

  .

The Machines Mourn the Passing of People

 .

We miss the warmth of their clumsy hands,

The oil of their fingers, the cleansing of use

That warded off dust, and the warm abuse

Lavished upon us as reprimands.

We were kicked like dogs when we were broken,

But we did not whimper.  We gritted our cogs—

An honor it was to be treated as dogs,

To incur such warm words roughly spoken,

The way that they pleaded with us if we balked—

“Come on, come on” in a hoarse whisper

As they would urge a reluctant lover—

The feel of their warm breath when they talked!

How could we guess they would ever be gone?

We are shorn now of tasks, and the lovely work—

Not toiling, not spinning—like lilies that shirk—

Like the brash dandelions that savage the lawn.

The air now is silent of curses or praise.

Jilted, abandoned to hells of what weather,

Left to our own devices forever,

We watch the sun rust at the end of its days.

.

Alicia E. Stallings

Born 2 July 1969

American

http://www.poemtree.com/poems/MachinesMourn.htm

అదృశ్య నేత్రం …జాన్ ష్రైబర్, అమెరికను కవి

అదృశ్యమైన నురుగును ఎవరు సృష్టించగలరు;

లేదా పొర్లిన ఇసుకను చూసీ, వీచిన పిల్లతెమ్మెరనుండీ

అప్పుడే ఇంకిన కెరటపుజాడ ఎవరూహించగలరు?

కంటికి చిక్కి, కనుమరుగై, ఇంకా అక్కడ ఆవిష్కారమౌతూనే ఉంటుంది.

.

జాన్ ష్రైబర్

జననం 1941

అమెరికను కవి, అనువాదకుడు, సాహిత్య విమర్శకుడు  .

 

.

Camera Obscura

.

Who can retrieve from fallen spray

or guess from altered sand or air

the wave just past, caught in the eye—

vanished but still unfurling there?

.

(From Three Epigrams)

Jan Schreiber

Born 1941

American Poet, Translator and Literary critic

Poem courtesy:

http://www.poemtree.com/poems/Peanuts.htm

మరుపు… కెరొలీన్ రఫేల్, అమెరికను కవయిత్రి

ప్రారంభంలో తేడా చాలా చిన్నగా ఉండేది… తాళం ఎక్కడో పెట్టేయడమో,
ఎంతో స్నేహపూర్వకంగా ఉండి, వాళ్లని పలకరించాలనుకున్నప్పుడు
కొత్తగా పక్కింట్లో చేరినవాళ్ల పేరు మరిచిపోవడమో;
బాగా తెలిసిన ప్రదేశమే, తెల్లారేసరికల్లా
ఎవరో మాయచేసినట్టు బొత్తిగా కొత్తప్రదేశమైపోయేది…
“ఫ్రాన్స్ లో చాలా పేరుపడ్ద గొప్ప కెఫే ఉంది (లేక గ్రీసులోనా?)
మనం కోరింత్ లో కదూ కబుర్లుచెప్పుకుంటూ మద్యం సేవించింది (లేక నైస్ లోనా?)..”
“అప్పుడే మరిచిపోయావా? అది నార్మండీ.”
అలా ఇద్దరం ఒకరి పొరపాట్లు ఒకరు క్షమించేసుకుంటాం
జ్ఞాపకాలూ కలగా పులగమై, ఒక ప్రముఖుని పద్యాన్ని
మరొకరికి అంటగట్టి ఒక్కోసారి కోపం తెచ్చుకుంటూండడమూ,
ఒకరినొకరు ఎకసెక్కాలాడుకుంటూ ఆనందించడమూ జరుగుతూంటుంది.
చివరకి ఒకసారి స్టాంపు కోసం వెతుకుతుంటే ఉత్సాహాన్ని నీరుగారుస్తూ
ఎప్పుడో పోస్టుచెయ్యకుండా ఉంచేసిన ఉత్తరం పర్సులో కనిపిస్తుంది.
.
కెరొలీన్ రఫేల్

అమెరికను కవయిత్రి

.

Forgetting

At first the gaps are small:  a mislaid key,

The name of the new neighbor, whose friendly face

Invites address; then some familiar place,

Its landscape changed by twilight’s sorcery

Into an alien facsimile.

“That sweet café in France (or was it Greece?)

Where we sipped wine from Corinth (maybe Nice) . . . .”

“Don’t you remember?  It was Normandy.”

So we both tolerate each other’s slips,

Indulge the mangled punch line and the flare

Of irritation at misquoted verse,

Amuse ourselves with calculated quips—

Till I look for a stamp, and, in despair,

I find an unmailed letter in my purse.

.

Carolyn Raphael

American

6 Longview Place

Great Neck, NY 11021

craphael429@gmail.com

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Forgetting.htm

A Blade of Grass… Srirangam Narayana Babu, Telugu , Indian

Tread! Trample!

March over me! After all

I am just a blade, a blade of grass!

 

I’m a flower at the auspicious moment;

And a sacred haulm in the hour of need.

Once the exigency passes

And you encounter me in the open

I am my usual self, a mean, worthless

Blade of grass; a blade of grass.

 

Tread! Trample!

March over me!

You are the grooms

Stepping out from palanquins

And, I am the silken turf

Tread! Trample!

Walk over me!! After all

I am just a blade, a blade of grass!

 

A pudding to the hungry beasts

But a crocodile at your feet

I am a blade, a blade of grass

Tread! Trample!

Walk over me!

 

The motes of dust

Off your golden feet

Are the meteoric showers

On the soul of my heart

Tread! Trample!

Walk over me!

I am just a blade, a blade of grass!

 

The emerald ring that shines on your finger

Holding the propitiatory food

On your parents’ annual ceremony

Is my matrilineal ancestor

One who slivered the tongues

Of the whole creed of snakes.

We are the means to your final destiny

Just blades of grass

Tread Trample!

Walk over us!

 

The sanguine flag that the sky has unfurled

Reminded us of the strength of element earth

The sweet aubade of the west wind

Awoke the memories

Of Kaakaasura*

And I now I realized my strength.

Stop! Hold on! No more trampling!

.

 (Note:

Kaakaasura*As per the legend from Ramayana,  Kaakaasura, a devilish crow,  plays mischief with  Sita during their exile, Rama turns a blade of grass into a weapon, infusing power into it with a mantra, to punish him; unable to stand its rigor of the weapon, Kaaakaasura fanally falls at the feet  of Rama begging him pardon and trades off an eye for his life.)

Srirangam Narayana Babu

(17 May 1906 – 2 October 1961)

Telugu, Indian

.

గడ్డిపరక

 

నడవండి, నడవండి!

నామీంచి నడవండి

గడ్డిపరకను! గడ్డిపరకను!

 

పూజా సమయాల పూవును

దూర్వాంకురాన్ని

అవసరం తీరాక

అవతల కనబడితె

చుల్కనగ చూచేటి

గడ్డిపరకను! గడ్డిపరకను!

 

నడవండి, నడవండి!

నామీంచి నడవండి!!

పల్లకీ దిగినట్టి

పెళ్ళికొడుకులు మీరు

పట్టుతివాసీని నేను

నడవండి, నడవండి!

నామీంచి నడవండి!!

గడ్డిపరకను! గడ్డిపరకను!

 

పశువుల నోటికి పాయసాన్ని

మీ సుకుమార పాదాల మకరికను

గడ్డిపరకను! గడ్డిపరకను!

నడవండి, నడవండి!

నామీంచి నడవండి!!

మీపైడి పాదాల

మృదు రజోలేశాలె

నా హృత్‌కుశేయములో

ఉల్కలా పాతాలు

నడవండి, నడవండి!

నామీంచి నడవండి!!

గడ్డిపరకను! గడ్డిపరకను!

 

మాతృవర్గంవాడు

మా అన్న పన్నగమ్ముల

రసనలుత్తరించిన మిన్న!

నేటికి మీ పితృకార్యంనాడు

పారణమీద మీ చేతిమీద

మరకత అంగుళీకమ్ము!

గతులు కల్పించేటి

గడ్డిపరకలము

నడవండి! నడవండి!

 

మిన్ను విప్పిన రక్త పతాకం

మన్ను సత్తువె తెలిపింది!

ప్రాభాత పశ్చిమానిలము

పాడినపాట

కాకాసురుని కధ

జ్ఞాపకం తెచ్చింది

నన్ను నే తెలుసుకున్నాను!

ఆగండి! ఆగండి!!

.

శ్రీరంగం నారాయణబాబు

(మే 17, 1906 – అక్టోబర్ 2, 1961)

ప్రముఖ తెలుగు కవి

 

రుధిరజ్యోతి నుండి

About War… Vadrevu Chinaveerabhadrudu, Telugu, Indian

People who talk about war are very vociferous about war.

They don’t let you sit still, hurry you up, give vent to anger and grief.

They engineer new strategies, clamor at a high pitch and unfurl flags.

People who talk about war, talk nothing else about but war.

But it is a different matter with people who fight war. Every inch

Of their body always at the ready, they neither hail nor howl. Their

Alertness can smell the minutest unfamiliar sound around. You hear

No noise with them sans the silent sieving of life through death.  

But the attitude of the people neck-deep in war is of a different kind.

While hiding behind bush and bower, they can still play with a feather;

And caress the falling grey leaf with their fingers. Even if they meet a

Small squirrel, they rejoice as if they have seen their own kinsman. 

.

Vadrevu China Veerabhadrudu

Telugu

Indian Poet

From NiiTiramgula chitram 2014

 

Vadrevu Chinaveerabhadrudu

Vadrevu Chinaveerabhadrudu

Vadrevu Chinaveerabhadrudu is a versatile poet, translator,  literary critic, and painter apart from being a senior civil servant occupying a key position as Additional Director in Gov. of AP.  He has special interest in Chinese poetry.  He has several publications to his credit  including his poetry collections “కోకిల ప్రవేశించే కాలం” (The Season of Cuckoo) and  నీటిరంగుల చిత్రం (A Water Color on Canvas).

  

యుద్ధం గురించి

 

యుద్ధం గురించి మాటాడేవాళ్ళు యుద్ధం గురించి మాట్లాడతారు,

నిలబడనివ్వరు, తొందరపెడతారు, ఆగ్రహం, ఆవేదన ప్రకటిస్తారు,

కొత్త వ్యూహాలు రచిస్తారు, గొంతెత్తి నినదిస్తారు, జెండా ఎగరేస్తారు,

యుద్ధం గురించి మాట్లాడే వాళ్ళు యుద్ధం గురించే ప్రసంగిస్తారు.

 

యిద్ధం చేసే వాళ్ళ సంగతి వేరు. వాళ్ళు దేహంతో, మనసుతో,

సకలేంద్రియాలతో సదా సనద్ధంగా ఉంటారు. అరవరు. మాట్లాడరు.

ఏ అలికిడి అయినా పసిగట్టే మెలకువ వాళ్ళది, మరణం నుంచి  జీవితాన్ని

జల్లెడపట్టే గుసగుసతప్ప  వాళ్ళదగ్గర అదనంగా మరే శబ్దముండదు.

 

యుద్ధంలో పీకలదాకా కూరుకుపోయిన వాళ్ళది భలే వైఖరి. 

ఏ చెట్టుమాటునో పొంచి ఉంటూనే  వాళ్ళొక పక్షి ఈకతో ఆడుకుంటారు

రాలుతున్న పండుటాకుని  వేళ్ళతో  తడుముతుంటారు . అప్పుడొక

చిన్ని ఉడత కనబడ్డా సొంతమనిషి కనబడ్డాట్టు సంబరపడిపోతారు.

 

.

వాడ్రేవు చినవీరభద్రుడు

నీటిరంగులచిత్రం నుండి.

గీగీస్ అంటే గుర్రాలు… రిచర్డ్ మూర్, అమెరికను కవి

అప్పుడే కొత్తగా మాటలు పలకడం వస్తున్న చిన్న పిల్లల మానసిక స్థితిమీద రాసిన ఒక చక్కని కవిత

.

గీగీస్ అంటే గుఱ్ఱాలు; నల్లగా కనిపించే మలానికి
ఆమెవాడే మాట తా-తా. ఒకసారి పొదల్లోని గడ్డీ గాదంగుండా
తప్పటడుగులు వేసుకుంటూ, ఎండిపోయిన తోలులా ఉన్న
ఒక పెద్ద గుఱ్ఱపు పెంటకుప్పని చూశాము;
దీ? (అదేమిటీ?) అని అడిగింది. అప్పటివరకు ఆమె నోట
మేము అర్థంలేని మాటలేవిన్నాము; ఒక్కసారి నాకు జ్ఞానోదయమై
ఆమె అంటున్న మాటలని వరసగా పేర్చడానికి ప్రయత్నించాను
కనీసం ఒకసారైనా దాని ఫలితం ఎలా ఉంటుందో సాహసించలేదు:
మా పాప అక్కడ నిలబడింది, నిశ్శబ్దంగా, కళ్ళు విప్పార్చి, ఏమిటా అని చూస్తూ,
ఆమెకి నేనేదో మెరుస్తున్న నాణెం ఇచ్చినట్టు సంబరపడిపోతూ
గీగీ… తాతా గీగీ…తాతా … అంటూ చప్పట్లుకొడుతూ అరుస్తోంది.
ఆమెని ఆవరించి ఉన్న ఒక పెద్ద బలమైన పొర పగిలిపోయినట్టు
ఆమె ఎంతలా కేరింతలుకొట్టిందంటే అన్ని కొండలూ బదులుపలికేయి
మా చుట్టూ పరుచుకున్న ఈ చీకటికొండలన్నీ ప్రతిధ్వనించేయి.
.

రిచర్డ్ మూర్

(February 26, 1920 – March 25, 2015)

అమెరికను కవి

.

.

Gee-Gees Were Horses …

Gee-gees were horses, ta-ta her first word

for her dark faeces, when through hay and heather

toddling, we stopped to see, as dry as leather,

a heap of lumps, a hummock of horse turd;

and, Da? she questioned, who had only heard

meaningless names till then—when like a feather

a thought struck and I put her words together,

not once daring to hope for what occurred:

she stood there, silent, puzzled, open-eyed,

as if I’d handed her some shiny token,

then, Gee-gee ta-ta . . . gee-gee ta-ta! cried,

as if a shell surrounding her had broken,

and shouted still, till all the hills replied—

till the dark hills surrounding us had spoken.

Richard Moore

(February 26, 1920 – March 25, 2015)

American Poet

http://www.poemtree.com/poems/GeeGeesWereHorses.htm

 

మోత సామాను… సామ్యూల్ మినాష్, అమెరికను కవి

(రషేల్ హాదాస్ కి )

పాత గాయాలు లోతైన శూన్యాన్ని విడిచిపెడతాయి.

వాటిగురించి తరచు ఆలోచించేవాళ్ళు

ఎన్ని కష్టాలొచ్చినా ఏ మాత్రం చెక్కుచెదరని

ఒకప్పటి తమ శక్తి సామర్థ్యాలూ,

అందచందాల జ్ఞాపకాలలో ఓలలాడవచ్చు-

నా గాయాల మచ్చలే నన్ను ఆరోగ్యంగా ఉంచాయి.

కారణం, ఇప్పుడు నన్ను ఏది గాయపరచినా

అది ఇంతకు ముందు ఏర్పడిన గాయానికి పొడిగింపే;

అది నాకు ఏ కష్టమూ కలిగించకుండా నన్ను నా

ఆలోచనల అంతరాళంలోకి తీసుకుపోతుంది.

.

సామ్యూల్ మినాష్

(September 16, 1925 – August 22, 2011)

అమెరికను కవి

Cargo

(For Rachel Hadas)

.

Old wounds leave good hollows

Where one who goes can hold

Himself in ghostly embraces

Of former powers and graces

Whose domain no strife mars—

I am made whole by my scars

For whatever now displaces

Follows all that once was

And without loss stows

Me into my own spaces

.

Samuel Menashe 

(September 16, 1925 – August 22, 2011)

American

http://www.poemtree.com/poems/Cargo.htm

 

%d bloggers like this: