సంధి… పాల్ లేక్, అమెరికను కవి

రాజ్యం చక్రాలను ఆపడానికి నా జీవితాన్ని
ఒకరకమైన వేగనిరోధినిగా చేసి
జైలుకి వెళ్ళాను… నా పన్నులు చెల్లించకుండా;
అంత నమ్మకం లేని మిత్రుడొకరు తిరిగి పన్ను

చెల్లించి ఆ పళ్ళచక్రం కదిలి నన్ను ప్రక్కకి
తొలగించేదాకా గడిపేను. అక్కడ
ఆ నాలుగు మందమైన రాతి గోడల మధ్యా,
బరువైన కలప- ఇనప తలుపులవెనక

గడిపిన సమయంలో, రాజ్యమూ, వాటి సంస్థలూ
తమకి ఇచ్ఛానుసారం బందీలుగా చెయ్యడానికి
మనుషులని కేవలం రక్తమాంసాలూ, ఎముకలప్రోవులుగా
ఊహించుకునే ఎంత దద్దమ్మలో అర్థం అయింది.

నేను జైలులో గడిపిన ఆ రాత్రి చాలా చిత్రమైనదీ
కుతూహలం రేకెత్తించేదీ: నా జైలు గది
నేను వెళ్ళేటప్పటికి చాలా పరిశుభ్రంగా ఉంది-
రాత్రి తాళాలు వేసే సమయందాకా అక్కడి బందీలు

బయటకి తొంగిచూస్తూ మాటాడుకునే పద్ధతి చూస్తే
అదొక జైలులా కాక చిన్న హోటలులా కనిపించిందినాకు.
ఒకసారి నా టోపీ ఎక్కడ తగిలించాలో తెలుసుకున్నాక
నేనో గోడవార హాయిగా చతికిలపడ్డాను.

బయటకి ఊచలగుండా చూడనారంభించబోతే
కళ్ళముందు చరిత్రపుటలు నా నగరాన్ని
మళ్ళీ చీకటి యుగాల్లోకి తీసుకుపోయాయి.
రైను నదితో ఒప్పందాలవరకూ.

మరుచటిరోజు ఉదయం, నిడుపుగా ఉన్న కన్నంలోంచి
మాకు ఆహారం అందించేరు- కొన్ని బ్రౌన్ బ్రెడ్ ముక్కలూ
పొగలుకక్కుతున్న చాకొలేట్ పాలూ …
ఫలహారం పూర్తి చేసిన తర్వాత

ప్రతిరోజూ మధ్యాహ్నం అయేదాకా పంటపొలాల్లో
గడ్డినూర్చికుప్పవేసే నా జైలుగది తోడు
నాకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ
మనిద్దరం కలవడం అనుమానమేనంటూ.

బయటపడ్డ నేను, నేను వీధి అవతల
మరమ్మత్తు చెయ్యడానికి ఇచ్చిన జోడు
తెచ్చుకుందికి వెళ్ళేను; ఏ ఆటంకం లేకపోవడంతో
దారంతా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళేను.

అలా నడుస్తూ నడుస్తూ నగరం నడిబొడ్డు దాటి
మళ్ళీ గుర్తొచ్చే వేళకి పొదలతో నిండిన ఊరికి
రెండుమైళ్ళ దూరంలో ఒక కొండ అంచున ఉన్నాను
నా మనసు నిర్మలంగా, నా బాధ్యత పూర్తిచేసుకుని.

.

పాల్ లేక్

జననం 1951

అమెరికను కవి.

 

Concord

.

To stop the wheels of state, I made

My life a kind of counter friction

And went to jail, my tax unpaid,

Until a friend with less conviction

Paid so its cogs might turn again

To spit me out.  And as I stood

Behind those four thick walls of stone,

That heavy door of iron and wood,

I saw how states and institutions

Must be half-witted, thinking men

Are merely flesh and blood and bones

To be locked up at their discretion.

The night I spent in jail was novel

And interesting enough:  My cell

Was clean and neat on my arrival—

It might have been a small hotel

The way the inmates leaned to chat

In doorways till the lockup call.

Once learning where to hang my hat,

I took my station at the wall

And gazed out through its grille, as pages

Of history seemed to waft my town

Backward to the Middle Ages,

Turning our Concord to the Rhine.

Next morning, through an oblong slot,

They passed our meal—brown hunks of bread

And steaming pints of chocolate —

And after having breakfasted,

My roommate, who spent mornings haying

In neighboring fields each day till noon,

Bade me good-bye and parted, saying

He doubted we’d be meeting soon.

Let out myself, I then proceeded

Across the street to fetch the shoe

I’d left to mend, then unimpeded

Strolled slowly down an avenue

And past the square and when last seen

On top a hill two miles from town,

Was lost in huckleberrying,

My conscience clear, my duty done.

Paul Lake

Born 1951

 

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Concord.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: