మాస్కోలోని జంతుప్రదర్శన శాల… ఎ. ఎమ్ జస్టర్. అమెరికను మాస్కోలోని జంతుప్రదర్శనశాలలో ఒక సామూహిక సమాధి చూశాం విషణ్ణవదనుడైన ఒక వ్యక్తి అందులోంచి ఒక పుర్రె తవ్వి తీశాడు. దాన్ని విలేఖరులందరికీ కనిపించేలా ఎత్తి చూపించేడు న్యాయవైద్యనిపుణులు వచ్చేరు ఉపేక్షించబడ్డ ఆ సమాధిలోని అవశేషాలను పోగుచేసి ఆధారాలను గుర్తించడానికి; కారణం ఇప్పటికీ ఆ జాగాలో ఎలుగుకి ఒక బోను నిర్మించే ఆలోచనలో ఉన్నారు. నిపుణులు ఇక్కడి సమాధిలోని వ్యక్తుల్ని ఏవో ప్రత్యేక కారణాలవల్ల కాల్చి చంపేరని నిర్ధారించేరు; కానీ సమానాంతరంగా నగరాల్లో అటువంటి సమాధులు ఉన్న దాఖలాలు ఎవరికీ తెలీదు. ఈ ఎముకలు గూఢచారులవో, యూదులని అనుమానించిన వారివో లేదా సమసమాజంకోసం గట్టిగా పోరాడినవారివో తెలీదు. అందుకని, అధికారులు హాయిగా ప్రశాంతంగా కార్లలో దిగి “అది బహుశా జార్ చక్రవర్తులు చేయించిన పని అయి ఉండొచ్చు” అనగానే, మా కెవ్వరికీ అది అనుమానించదగినదిగా కనిపించలేదు. . ఏ. ఎమ్ . జస్టర్ జననం 1 అక్టోబరు 1956 అమెరికను కవి, విమర్శకుడు . . Moscow Zoo We saw the mass grave at the Moscow Zoo. A sullen man dug up a human skull Then held it high for journalists to view. Forensic specialists arrived to cull Remains and clues from this forgotten plot On which the zoo still plans to cage a bear. The experts guessed these prisoners were shot For special reasons; no one was aware Of comparable scenes at urban sites. No one knew if these bones belonged to spies, Suspected Jews or zealous Trotskyites, So none of us displayed the least surprise When bureaucrats emerged from quiet cars To hint this might have been the work of czars. A.M. Juster Born 1st October 1956 American Poem Courtesy: http://www.poemtree.com/poems/MoscowZoo.htm Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే సెప్టెంబర్ 24, 2017
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు#2015AM JusterAmericanBorn 1 Oct 1956 తాగుబోతు… జడ్సన్ జెరోమ్ , అమెరికను కవిరహస్యాలు…. లెన్ క్రిసాక్, అమెరికను కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.