తాగుబోతు… జడ్సన్ జెరోమ్ , అమెరికను కవి

మా నాన్న తాగేవాడు (అందరి నాన్నలూ తాగరూ?)-
ఆ తరానికి చెందిన గొప్ప చెడు అలవాటది
అతను మమ్మల్ని చితకబాది పడిపోతుంటే, చాలా ఓపికగా
అతన్ని అర్థంచేసుకుందికి ప్రయత్నించేవాళ్ళమి
అందరం క్షమించే వాళ్లమి (జీవితమనగా ఎంత, క్షణికం!)
అది తప్పో ఒప్పో చెప్పడానికి అందరం నిరాకరించే వాళ్ళమి.
మాకు తెలుసు, నోరార్చుకుపోయే ఈ వేడి ఓక్లహామా నగర వాతావరణంలో
తాగుడుకి ఒకే ఒక్క విరుగుడు ఆప్యాయతా, ప్రేమా మాత్రమే.
ఈ శరీరము దుర్బలమూ, శ్వాస బలహీనమూ అని తెలుసు
అందుకే అందరూ కోరికలకి దాసులై మృత్యువాతపడుతుంటారు.

కానీ అతను నన్ను తిడుతూ, దబాయిస్తూ సవాలు విసిరినపుడు,
నా ఆలోచనల, జ్ఞాపకాల్లోంచి సన్నగా జారుకుంటున్నపుడు,
దవడ క్రిందకి జారిపోయి నాలిక తడబడుతూ మాటాడుతున్నపుడు
అతనికి అవగాహనతోనే సమాధానం ఇచ్చిఉండవలసిందేమో?
అతను ఏంచేస్తున్నా అది అతని బలహీనత అని అనుకునే వాళ్లం.
(నవ్వుతూ, లాక్కున్న ఒక పదిని ఊపుతూ అతను పారిపోయే వాడు)
అతని హృదయం నిష్కల్మషం, అతని బుర్రే తిన్ననైనది కాదు
అనుకునే వాళ్లం. (తర్వాత అరుస్తూ ఆయాసపడడం చూసేవాడిని)

అతను గతించిన చాలా సంవత్సరాలకి వెనుతిరిగి చూసుకుంటే
మేం అతన్ని ఎంతగా అవమానించేవాళ్లమో, దిగజారేలా చేశామో తెలుస్తోంది.
అతనికి ఆత్మవిశ్వాసం లేదనీ, ఎప్పుడూ తప్పులు చేస్తాడనీ అంటూ,
అతనికిగల తప్పుచేసే హక్కుని నిరాకరించాం.
పాపం లం.కొ. (దేముడు అతన్ని క్షమించుగాక!) తాగి తాగి చనిపోయాడు
ఎందుకంటే అతని స్వాభిమానాన్ని మేము అర్థంచేసుకోలేకపొయాం.
.
జడ్సన్ జెరోమ్
(8 February 1927 – 5 August 1991)
అమెరికను కవి

Alcoholic

My father (didn’t everybody’s?) drank—

The Dread Disease, plague of his generation—

And we were patient, swallowed down his spite,

And understood him as he thrashed and sank,

And all forgave (oh, life means brief duration!)

And all refrained from saying wrong or right.

We knew, in dry, bright Oklahoma City,

The only cure for drink was love and pity.

We knew the flesh was frail, with delicate breath,

And so indulged each other into death.

But when he dared me—cursing me, demanding—

And shuffling scrawnily down halls of my mind,

Sagging his jaw, speaking with tongue gone blind,

Should I have answered him with understanding?

He cannot help the things he does, we said.

(He grinned and snitched a ten and drove off, weaving.)

His heart, we said, is spotless—but his head

Disturbed. (Late I would hear him, racketing, heaving.)

Years after he was gone I think I saw

How we insulted him, drove him along:

His spirit we called nerves, said nerves were raw,

Denied his holy sanction to be wrong.

The sonofabitch (God bless him) drank and died

Because we understood away his pride.

.

Judson Jerome

(8 February 1927 – 5 August 1991)

American poet

Poem Courtesy: 

http://www.poemtree.com/poems/Alcoholic.htm 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: