నాన్న… జెఫ్ హోల్ట్, అమెరికను కవి అతను మా అమ్మ మాతోఉండనిచ్చిన అతిథిలా కనిపించే వాడు కారు నిండా ఏవో కాగితాల కట్టలు నింపుకుని ఎప్పుడో గాని మాతో మాటాడేవాడు కాదు; అయితే ప్రమాదం లేని వ్యక్తి. ఒకరోజు అతను తను చదువుకుంటున్న గది ఓరువాకిలిగా విడిచిపెడితే సగం గాలికొట్టిన నా బంతిని గట్టిగా తన్నేను సగంతెరిచిన తలుపుసందులోంచి వస్తున్న వెలుగులోకి. తలుపు అన్నేళ్ళుగా మూసి ఉంచినందుకు నిరసన ప్రకటిస్తున్నట్టు గోడకేసి గట్టిగా దభాలున చప్పుడుచేస్తూ కొట్టుకుంది అతను బయటకి పరిగెత్తుకొచ్చాడు, నాలా కళ్ళు పెద్దవి చేసుకుంటూ అతని ఆగ్రహానికి ఎదురుచూస్తూ అతని ముందు నిలబడ్డాను. ఒక్కడినీ ఆడుకుంటూ ఎందుకతన్ని తన గుహలోంచి బయటికి రప్పించేనో అతనికి చెప్పదలుచుకోలేదు. కోపం తెచ్చుకోడానికి బదులు గట్టిగా ఒక నవ్వు నవ్వి పేరుపెట్టి పిలిచాడు ఆటలో ఓడిపోయానని తెలుసుకుని నేనే వెనకడుగువేసి పారిపోయాను. . జెఫ్ హోల్ట్ జననం 1971 అమెరికను కవి. . Dad . He seemed a stranger Mom let stay with us, The man with stacks of papers in his car Who rarely spoke, but wasn’t dangerous. One day he left his study door ajar And I drop-kicked my half-inflated ball Into the crack of light he’d left exposed. The door flew back, crashing against the wall As if protesting years of staying closed. He hurried out, his eyes wide as my own. I stood before him, waiting for his rage. I couldn’t tell him why, playing alone, I’d broken in and drawn him from his cage. Rather than roar, he smirked and mouthed my name. I shrank away knowing I’d lost the game. . Jeff Holt Born 1971 American Poem Courtesy: http://www.poemtree.com/poems/Dad.htm Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిసెప్టెంబర్ 21, 2017