మార్చి నెలా! ఏదీ, నీ సుప్రభాత ప్రార్థనలను మరొక్కసారి వినిపించు!
పెళుసెక్కిన రెమ్మలమీంచి ఏ ఆశ్రయాన్నీవ్వలేని బోడి చెట్ల
కొమ్మలపైకి అలుపులేక ఎగిరే పక్షుల రెక్కల చప్పుడు వినిపించు.
భూమి దున్నడానికి ఇంకా చలిగా ఉంది, లే చివురులను వాగ్దానం చెయ్యి;
మరొకసారి నీ రాకని ప్రకటించు, పచ్చని ఆశీర్వాదమా,
సూర్యుని ముద్దులమూటా! ఓ భ్రమరాల్లారా, మౌనంగా ఉండకండి,
ఈ నెలనుమించిన కరుణార్ద్రమైన పేర్లను చెప్పి ఒప్పించండి చూద్దాం,
ఇపుడు లభించే రుచిర ఫలాలను మించినవుంటే చెప్పండిచూద్దాం.
హృదయం దాని సందేహాల విషయంలో స్థిరంగా ఉంటుంది:
తొలిరోజులు కాఠిన్యానికి ప్రతీకలుగా ఎలా ఉంటాయో
పునరావృతమయే కష్టకాలాలను నెమరువేసుకుంటూ.
బారులు తీరుస్తూ ఉత్తరదిశగా నా నగరాకాశాన్ని కమ్ముతున్న బాతులారా
మీ కేమైనా కబుర్లు తెలుసా, ఎందుకు తిరిగొస్తున్నారో తెలుసా,
నాకు అర్థమయేదాకా, పదే పదే బోధించండి!
.
రైనా పి. ఎస్పేలాట్
జననం: 20 జనవరి 1932
డొమినికను రిపబ్లిక్ – అమెరికను కవయిత్రి
.
స్పందించండి