రోజు: సెప్టెంబర్ 20, 2017
-
మార్చి… రైనా ఎస్పేలాట్, డొమినికన్ రిపబ్లిక్ – అమెరికను కవయిత్రి
మార్చి నెలా! ఏదీ, నీ సుప్రభాత ప్రార్థనలను మరొక్కసారి వినిపించు! పెళుసెక్కిన రెమ్మలమీంచి ఏ ఆశ్రయాన్నీవ్వలేని బోడి చెట్ల కొమ్మలపైకి అలుపులేక ఎగిరే పక్షుల రెక్కల చప్పుడు వినిపించు. భూమి దున్నడానికి ఇంకా చలిగా ఉంది, లే చివురులను వాగ్దానం చెయ్యి; మరొకసారి నీ రాకని ప్రకటించు, పచ్చని ఆశీర్వాదమా, సూర్యుని ముద్దులమూటా! ఓ భ్రమరాల్లారా, మౌనంగా ఉండకండి, ఈ నెలనుమించిన కరుణార్ద్రమైన పేర్లను చెప్పి ఒప్పించండి చూద్దాం, ఇపుడు లభించే రుచిర ఫలాలను మించినవుంటే చెప్పండిచూద్దాం.…