దా, నా దగ్గర కూర్చో! నీ అభిప్రాయంలో ప్రేమంటే ఏమిటో, ఏది ప్రేమకాదో వివరించు. మనం అదనుకోసం నిరీక్షిస్తున్నంతసేపూ మాటాడు మనం కాలహరణం చేస్తున్నంతసేపూ మాటాడుతూనే ఉండు. తార్కికశక్తిపై నాకు తిరుగులేని,దృఢమైన నమ్మకమున్నా పణంగా ఉంచిన ప్రాణాల లెక్కలు వచ్చినపుడు ప్రతిసంకోచం, అనిశ్చితి వెనకా తారాడే నర్మగర్భమైన మాటలు వినడానికి ఇష్టమే; అది బెరుకుగా చూసే చూపు కావచ్చు, దీర్ఘంగా బిగబట్టి విడిచిన నిట్టూర్పు కావచ్చు; లేదా అసంకల్పితంగా, సమయాన్ని మించి చేతిలో ఉంచిన మరో చేతి సంస్పర్శ కావచ్చు; నువ్వు చెప్పింది ప్రేమా, కాదా అన్నదానితో నిమిత్తం లేకుండా నేను నీతో గడపడానికి నిశ్చయించుకున్నాను. .
స్పందించండి