నా జీవితం చివరకు వచ్చేసింది; గణాంకశాస్త్ర
రీత్యా అది రాబట్టిన సత్యమైనా, అది నిజమే;
నేను అద్దంలో చూసుకోబోతే, అది పగిలి ఉంటుంది.
అందుకని అది ఒకటి, రెండు, మరెన్నో పొంతనలేని ప్రతిబింబాలు
చూపిస్తుంది; వాటిలో దేని లక్ష్యాన్నని నేను అందుకో ప్రయత్నించను?
నా జీవితమా చరమాంకానికి వచ్చేసింది. అది సత్యం.
ఇక మిగిలిన సమయంలోనంటావా? సామాను చాలవరకు సర్దేశాను.
కట్టలుగట్టి పెట్టెల్లో పెట్టేశాను; చెయ్యడానికింకేమీ లేదు;
నేను అద్దంలోకి చూసుకుంటే, అది పగిలి కనిపిస్తుంది.
దాన్ని బాగుచెయ్యలేం. అదెప్పుడూ దానిముందున్న
రూపాన్ని కనీసం రెండు రూపాలుగా చూపిస్తుంది.
నా జీవితం ముగింపుకొచ్చింది; అది మాత్రం సత్యం.
అయినా, జీవితాన్ని ఎవరూ నైరూప్యంగా జీవించలేరు,
దానికి తెలిసిన వాస్తవాల్ని అదెప్పుడూ కోరుకుంటుంది;
నేను అద్దంలోకి చూద్దును గదా! అది పగిలి ఉంటుంది.
నేను ఖచ్చితత్వంకోసం వెతుకుతుంటాను;
రాత్రుళ్ళు నాకళ్ళముందునుండి ప్రతిబింబాన్ని కరిగిస్తుంటాయి;
నేను అద్దంలోకి చూడబోతే అది పగిలి ఉంటుంది.
నా జీవితం అయిపోవచ్చింది; అది ఖచ్చితం.
.
డేవిడ్ బెర్మన్
జననం 4 జనవరి 1967
సమకాలీన అమెరికను కవి .
.
.
The Broken Mirror
.
My life is almost over; that’s a fact
Statistically derived but simply true;
I look into the mirror, but it’s cracked
And so reflects two, three, or more, that lack
Cohesion. Which one’s goal shall I pursue—
My life is almost over; that’s a fact—
In time remaining? Luggage largely packed,
Past boxed and crated, little left to do,
I look into the mirror, but it’s cracked
And won’t be fixed and always did refract
The one before it into at least two.
My life is almost over; that’s a fact,
But life cannot be lived in the abstract
And begs for certainties that it once knew:
I look into the mirror, but it’s cracked;
I look away in search of the exact;
Nights melt the shadow shrinking from my view;
I look into the mirror, but it’s cracked.
My life is almost over; that’s my fact.
David Berman
Born 4 Jan 1967
Poem Courtesy:
http://www.poemtree.com/poems/BrokenMirror.htm
స్పందించండి