సూర్యాస్తమయమూ, సాంధ్య తారకా… రమ్మని నాకోసం ఒక స్పష్టమైన పిలుపు! నేనా ఇసుకతిన్నెను దాటి సాగరంలోకి అడుగిడినపుడు ఎవరూ శోకించకుందురు గాక!
నిద్రాకెరటమెంత తీవ్రంగా చుట్టుముడుతుందంటే
గురకపెట్టడమూ, చొంగకార్చడమూ ఉండవు. మేరలేని అగాథాల లోతులలోంచి బయటకు తెచ్చినదే
చివరకు స్వస్థానానికి తిరిగి జాగ్రత్తగా చేరుస్తుంది.
అసురసంధ్యాకాలమూ, సాంధ్యఘంటారవాలూ … ఆ తర్వాత అంతా చిక్కని చీకటే! నేను పడవలోకి ఎక్కినపుడు ఏ విషాదపు వీడ్కోలులూ ఉండకుండు గాక!
దేశకాల సరిహద్దులనుండి తిన్నగా ఈ ఉప్పెన నన్ను చాలా దూరం మోసుకుపోతుంది, నేను ఈ ఇసుకతిన్నెల సరిహద్దును దాటిన వెంటనే నా నావికుణ్ణి ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నాను. .