అనువాదలహరి

సత్యం ఉత్కృష్టమైనది … కొవెంట్రీ పాట్ మోర్, ఇంగ్లీషు కవి

మహానగరానికి దూరంగా,సూదిగా ఎత్తుగా ఉన్న శిఖరాల క్రింద

సందడిగా ఉంటూనే మనసుకి

ప్రశాంతతనిచ్చే ఈ సముద్రతీరాన

రోజుకి రెండుసార్లు పెద్దకెరటాలతో (High Tide)

ఏ లక్ష్యమూ లేకుండా, ఉత్సాహంతో వచ్చిపోయే సముద్రాన్ని చూడడానికి

నేను వచ్చి కూచుంటుంటాను.

నేను లేకపోయినంత మాత్రాన్న లోకవ్యవహారం ఆగిపోదు;

దాని లక్ష్యం నెరవేరిన తర్వాత అసత్యం కూడా మురిగిపోతుంది.

కానీ సత్యం మాత్రం చాలా ఉత్కృష్టమైనది…

దాని ఉనికిని ఇతరులు పట్టించుకున్నా లేకున్నా,

అశ్రాంతంగా కొనసాగుతూనే ఉంటుంది.

.

కొవెంట్రీ పాట్ మోర్

(23 July 1823 – 26 November 1896)

ఇంగ్లీషు కవి .

.

Magna Est Veritas

(Truth Is Great)

.

Here, in this little Bay,

Full of tumultuous life and great repose,

Where, twice a day,

The purposeless, glad ocean comes and goes,

Under high cliffs, and far from the huge town,

I sit me down.

For want of me the world’s course will not fail:

When all its work is done, the lie shall rot;

The truth is great, and shall prevail,

When none cares whether it prevail or not.

.

Coventry Patmore

(23 July 1823 – 26 November 1896)

English Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/MagnaEstVeritas.htm

%d bloggers like this: