నెల: సెప్టెంబర్ 2017
-
సంధి… పాల్ లేక్, అమెరికను కవి
రాజ్యం చక్రాలను ఆపడానికి నా జీవితాన్ని ఒకరకమైన వేగనిరోధినిగా చేసి జైలుకి వెళ్ళాను… నా పన్నులు చెల్లించకుండా; అంత నమ్మకం లేని మిత్రుడొకరు తిరిగి పన్ను చెల్లించి ఆ పళ్ళచక్రం కదిలి నన్ను ప్రక్కకి తొలగించేదాకా గడిపేను. అక్కడ ఆ నాలుగు మందమైన రాతి గోడల మధ్యా, బరువైన కలప- ఇనప తలుపులవెనక గడిపిన సమయంలో, రాజ్యమూ, వాటి సంస్థలూ తమకి ఇచ్ఛానుసారం బందీలుగా చెయ్యడానికి మనుషులని కేవలం రక్తమాంసాలూ, ఎముకలప్రోవులుగా ఊహించుకునే ఎంత దద్దమ్మలో అర్థం…
-
రహస్యాలు…. లెన్ క్రిసాక్, అమెరికను కవి
(… ఏంథొనీ లొంబార్డీ స్మృతిలో ) కొందరనుకుంటున్నట్టు అతను చాలా మెల్లిగా పనులుచేస్తాడనో, లేదా చాలా సామాన్య విషయాలకే అతిగా నవ్వుతాడనో అతన్ని మూర్ఖుడిగా జమకట్టవచ్చు. కానీ అది నిజం కాదు. ఉత్తరాలు తీసుకువచ్చే అతనికోసం ఎంతలా ఎదురుచూస్తామో అంతలా అతని అడుగులచప్పుడుకోసం ఎదురుచూసేవాళ్ళం. తలుపుకి తగిలించిన ఓవర్ కోటు మాకు నాలుగైదేళ్ళప్పుడు అందులో వెళ్ళిన మనిషి తిరిగివచ్చేడని సూచించేది. మమ్మల్ని ఎగరేసి ఎత్తుకోవడం, గుర్రం ఆడటం ఒక్కటే కాకుండా అతనికి చాలా విషయాలలో ప్రావీణ్యం ఉంది.…
-
మాస్కోలోని జంతుప్రదర్శన శాల… ఎ. ఎమ్ జస్టర్. అమెరికను
మాస్కోలోని జంతుప్రదర్శనశాలలో ఒక సామూహిక సమాధి చూశాం విషణ్ణవదనుడైన ఒక వ్యక్తి అందులోంచి ఒక పుర్రె తవ్వి తీశాడు. దాన్ని విలేఖరులందరికీ కనిపించేలా ఎత్తి చూపించేడు న్యాయవైద్యనిపుణులు వచ్చేరు ఉపేక్షించబడ్డ ఆ సమాధిలోని అవశేషాలను పోగుచేసి ఆధారాలను గుర్తించడానికి; కారణం ఇప్పటికీ ఆ జాగాలో ఎలుగుకి ఒక బోను నిర్మించే ఆలోచనలో ఉన్నారు. నిపుణులు ఇక్కడి సమాధిలోని వ్యక్తుల్ని ఏవో ప్రత్యేక కారణాలవల్ల కాల్చి చంపేరని నిర్ధారించేరు; కానీ సమానాంతరంగా నగరాల్లో అటువంటి సమాధులు ఉన్న దాఖలాలు…
-
తాగుబోతు… జడ్సన్ జెరోమ్ , అమెరికను కవి
మా నాన్న తాగేవాడు (అందరి నాన్నలూ తాగరూ?)- ఆ తరానికి చెందిన గొప్ప చెడు అలవాటది అతను మమ్మల్ని చితకబాది పడిపోతుంటే, చాలా ఓపికగా అతన్ని అర్థంచేసుకుందికి ప్రయత్నించేవాళ్ళమి అందరం క్షమించే వాళ్లమి (జీవితమనగా ఎంత, క్షణికం!) అది తప్పో ఒప్పో చెప్పడానికి అందరం నిరాకరించే వాళ్ళమి. మాకు తెలుసు, నోరార్చుకుపోయే ఈ వేడి ఓక్లహామా నగర వాతావరణంలో తాగుడుకి ఒకే ఒక్క విరుగుడు ఆప్యాయతా, ప్రేమా మాత్రమే. ఈ శరీరము దుర్బలమూ, శ్వాస బలహీనమూ అని…
-
Two Poems from Amukta Malyada… Sri Krishnadevaraya, Telugu, Indian
Just as Madhava, occupied the three worlds To subdue the haughtiness of Virochana’s son His namesake, the Spring, subdued nether world, earth and ether With cascades of nectar, flowerscape and their spores. Under the swarm of bees Savoring the stream of wafting spores The trees, at spring time, looked like shadows Standing still and moving…
-
నాన్న… జెఫ్ హోల్ట్, అమెరికను కవి
అతను మా అమ్మ మాతోఉండనిచ్చిన అతిథిలా కనిపించే వాడు కారు నిండా ఏవో కాగితాల కట్టలు నింపుకుని ఎప్పుడో గాని మాతో మాటాడేవాడు కాదు; అయితే ప్రమాదం లేని వ్యక్తి. ఒకరోజు అతను తను చదువుకుంటున్న గది ఓరువాకిలిగా విడిచిపెడితే సగం గాలికొట్టిన నా బంతిని గట్టిగా తన్నేను సగంతెరిచిన తలుపుసందులోంచి వస్తున్న వెలుగులోకి. తలుపు అన్నేళ్ళుగా మూసి ఉంచినందుకు నిరసన ప్రకటిస్తున్నట్టు గోడకేసి గట్టిగా దభాలున చప్పుడుచేస్తూ కొట్టుకుంది అతను బయటకి పరిగెత్తుకొచ్చాడు, నాలా కళ్ళు…
-
మార్చి… రైనా ఎస్పేలాట్, డొమినికన్ రిపబ్లిక్ – అమెరికను కవయిత్రి
మార్చి నెలా! ఏదీ, నీ సుప్రభాత ప్రార్థనలను మరొక్కసారి వినిపించు! పెళుసెక్కిన రెమ్మలమీంచి ఏ ఆశ్రయాన్నీవ్వలేని బోడి చెట్ల కొమ్మలపైకి అలుపులేక ఎగిరే పక్షుల రెక్కల చప్పుడు వినిపించు. భూమి దున్నడానికి ఇంకా చలిగా ఉంది, లే చివురులను వాగ్దానం చెయ్యి; మరొకసారి నీ రాకని ప్రకటించు, పచ్చని ఆశీర్వాదమా, సూర్యుని ముద్దులమూటా! ఓ భ్రమరాల్లారా, మౌనంగా ఉండకండి, ఈ నెలనుమించిన కరుణార్ద్రమైన పేర్లను చెప్పి ఒప్పించండి చూద్దాం, ఇపుడు లభించే రుచిర ఫలాలను మించినవుంటే చెప్పండిచూద్దాం.…
-
The Angst… Ravi Verelly, Telugu Indian.
When the butterflies squiggle poems in their flight for flowers, Or, the wind and the blades of straw are locked in playing piggy-ride Or, when spectra open up their pinions full on the tails of sunrays You enter into my thoughts. * After your departure When I was struggling to find answers to the seething…
-
మరో చిత్రప్రదర్శనశాలకు మార్గసూచి …డేనా జోయ్ యె
ఇది విరిగిపోయిన అవయవాలుంచే గది. ఇక్కడ దేవదూతల చేతుల చెంతనే ముక్కలైన పాలరాతి క్రీడాకారుల విగ్రహాలున్నాయి. ఇక్కడ ఏవీ బయటపారవేయబడవు. ఈ తుమ్మెదలు వరుసలో పేర్చబడి ఉన్నాయి. చిన్నగా, లోపలి పదార్ధం ఎంత రంగువెలిసి ఉన్నాయంటే అవన్నీ ఒక్కలాగే కనిపిస్తున్నాయి. బహుశా, మృత్యువు అన్నిజీవుల్లోనూ సారూప్యత తీసుకువస్తుందేమో! మూడు వరుసలలో అజ్ఞాత వ్యక్తుల చిత్తరువులు ఒకదానిమీద ఒకటి ఇక్కడ వేలాడదీసి ఉన్నాయి. పాపం, పేరుకోసం తపించిన ప్రతి ఆత్మా అనామకంగా ఇక్కడ చిరస్థాయిగా పడిఉండవలసిందే. ఇక్కడ ఇవిగో…
-
ఉచితానుచితాలు… రాబర్ట్ ప్రాన్సిస్, అమెరికను కవి
సౌందర్యం ఉచితంగా ఉంటుంది. న్యాయమూ ఉచితంగానే ఉంటుంది. కానీ ఏం లాభం? ఒకటి అతిసామాన్యమైతే రెండోది అత్యంత అపురూపం. ఒకటి అన్నిటా కనిపిస్తే, రెండోది కలికానికికూడా కనరాదు. ఈ ప్రపంచం ఉచితానుచితాలమయం. మనకే వివేకం ఉంటే, అతివేలమయినదానితో, అరుదైనదాన్ని భర్తీచేసి ఈ ప్రపంచాన్నీ ఎంతో యోగ్యమైనదానిగా చేసి ఉండేవాళ్ళం. . రాబర్ట్ ఫ్రాన్సిస్ (12 August 1901 – 13 July 1987) అమెరికను కవి Fair and Unfair The beautiful is fair. The…