మోడువారి, నగ్నంగా ఉన్న అటవీ సీమల మీంచి కోతల తర్వాత ఉపేక్షించబడిన పంటభూములమీంచి గాలి గుండె లోతుల్లోంచి, దాని మొయిలు ఉడుపుల కదలికలలలోంచి, నిశ్శబ్దంగా, నెమ్మదిగా, మెత్తగా మంచు జాలువారుతోంది.
చిత్రమైన ఆకారాలు ధరించే ఈ మేఘాలు అకస్మాత్తుగా దివ్యాకృతుల్లో కనిపించినా, పాలిపోయిన వదనంతో కలతచెందిన మనసు తన తప్పిదాలను ఒప్పుకుని మన్నించమని వేడుకుంటుంటే ఉద్విగ్నమైన ఆకాశ శకలం తన మనసులోని బాధను వ్యక్తం చేస్తుంది.
ఈ కవిత గాలి అంతరంగ వ్యధ మౌనంగా సడిలేని శబ్దవర్ణాలతో లిఖించబడింది; మేఘాలగుండె లోతుల్లో చిరకాలంనుండీ పదిలంగా దాచుకున్న నిరాశా రహస్యం; ఇన్నాళ్లకి అది వనభూములకీ, మైదానాలకీ గుసగుసలువోతూ చెప్పుకొస్తోంది. . H W లాంగ్ ఫెలో (February 27, 1807 – March 24, 1882) అమెరికను.
One thought on “మంచు పలకలు … H W లాంగ్ ఫెలో, అమెరికను”
యే భాషలోని పద్యమైనా మంచి అనువాదాల వల్ల గొప్పగా అందగిస్తాయి. యీ పద్యం తెలుగు వల్ల ఆకర్షితతుడునై తరువాత యింగ్లీషు వర్షన్ చదివాను. యింగ్లీషు పదాలు తెలిసినవే గాని, తలుగులు ఆత్మకు అంట లేదు. అనువాదాల అవసరాన్ని చెప్పి వొప్పించే అనువాదనమిది.

మెచ్చుకోండిమెచ్చుకోండి