మోడువారి, నగ్నంగా ఉన్న అటవీ సీమల మీంచి కోతల తర్వాత ఉపేక్షించబడిన పంటభూములమీంచి గాలి గుండె లోతుల్లోంచి, దాని మొయిలు ఉడుపుల కదలికలలలోంచి, నిశ్శబ్దంగా, నెమ్మదిగా, మెత్తగా మంచు జాలువారుతోంది.
చిత్రమైన ఆకారాలు ధరించే ఈ మేఘాలు అకస్మాత్తుగా దివ్యాకృతుల్లో కనిపించినా, పాలిపోయిన వదనంతో కలతచెందిన మనసు తన తప్పిదాలను ఒప్పుకుని మన్నించమని వేడుకుంటుంటే ఉద్విగ్నమైన ఆకాశ శకలం తన మనసులోని బాధను వ్యక్తం చేస్తుంది.
ఈ కవిత గాలి అంతరంగ వ్యధ మౌనంగా సడిలేని శబ్దవర్ణాలతో లిఖించబడింది; మేఘాలగుండె లోతుల్లో చిరకాలంనుండీ పదిలంగా దాచుకున్న నిరాశా రహస్యం; ఇన్నాళ్లకి అది వనభూములకీ, మైదానాలకీ గుసగుసలువోతూ చెప్పుకొస్తోంది. . H W లాంగ్ ఫెలో (February 27, 1807 – March 24, 1882) అమెరికను.