Trout
Brinded Cow
Finch
ఇన్ని వన్నెచిన్నెలుగల ప్రకృతిని సృష్టించిన దైవానికి నుతులు.
పొడల ఆవులా జంట రంగుల్లో కనిపించే ఆకాశమూ;
విలాసంగా ఈదే చుక్కలచుక్కల జల్లచేపకి పక్కలో గులాబిరంగు మెరుపులూ;
అప్పుడేవెలిగించిన బొగ్గులా చెట్లనుండి రాలిన బాదంలూ; ఫించ్ పక్షుల బారజాచిన రెక్కలూ;
పంటపొలాలతో, చవిటినేలలతో, రకరకాలచెట్లతో కనుచూపుమేరా అలంకరించే ప్రకృతిదృశ్యాలూ
అన్ని రకాల వృత్తులూ, వాటి పరికరాలూ, పనిముట్లూ వగైరా వగైరా. ఓహ్! ఏం చెప్పను!
అందులో మళ్ళీ సహజమైనవీ, అనుకరణలూ, చిత్రమైనవీ, అరుదైనవీ,
చంచలమైనవన్నీ వింత వింత వన్నెల్లో (అవెందుకలా ఉన్నాయో ఎవరు చెప్పగలరు?)
వడియైనవీ, నెమ్మదియైనవీ, తియ్యనివీ, పుల్లనివీ, మెరిసేవీ, అస్పష్టమైనవీ ;
ఇన్నింటి సౌందర్యం మార్పుకి అతీతంగా తీర్చిదిద్దిన ప్రభువు అతను.
అతనికి జేజేలు పలకండి.
.
గెరార్డ్ మాన్లీ హాప్కిన్స్
(28 July 1844 – 8 June 1889)
ఇంగ్లీషు కవి
స్పందించండి